Pawan was In Charan’s Role : కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. ఈ సినిమాలో తొలుత చరణ్ పాత్ర కోసం మహేష్ పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే, అదంతా ఉత్తదేనని ఆ తర్వాత తేలింది.
ఒకవేళ చరణ్ కాకపోతే, ఆ పాత్రలో ఎవరైతే బావుంటుందని మెగాస్టార్ చిరంజీవిని అడిగితే, ‘నేనయితే పవన్ కళ్యాణ్‌తో కలిసి సినిమా చేయాలనుకుంటాను..’ అని ఠక్కున సమాధానమిచ్చారాయన. దాంతో అంతా షాకయ్యారు.
ఒకవేళ పవన్ గనుక ‘ఆచార్య’లో నటించి వుంటే ఏమయ్యేది.? ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ సినిమా టిక్కెట్ల ధరలు తగ్గిపోయేవి. థియేటర్ల దగ్గర అధికారులు కాపలా కాసేవాళ్ళు. మంత్రులు మీడియా ముందుకొచ్చి ‘ఆచార్య’ సినిమాకి నెగెటివ్ రివ్యూలూ ఇచ్చేవారు.
‘భీమ్లానాయక్’ సినిమా విషయంలో అలాగే జరిగింది మరి. ‘ఆచార్య’లో పవన్ గనుక వుండి వుంటే, చిరంజీవి చాలా చాలా ఇబ్బంది పడేవారే. ఇప్పుడు చిరంజీవిని దేవుడంటున్నవారే, అప్పుడు రాక్షసుడని విమర్శించేవారేమో. సినిమా వేరు, రాజకీయం వేరు కాదు.
సినిమా చుట్టూనే ఏపీలో రాజకీయం నడుస్తోంది. పైగా, పవన్ కళ్యాణ్ సినిమా అంటే వైసీపీ చేసే రాజకీయం.. మరీ అరాచకంగా వుంటుంది.