Kashmir files movie : అసలేంటీ సినిమా? ప్రపంచ వ్యాప్తంగా “కాశ్మీర్ ఫైల్స్” సెన్సేషన్.!

Kashmir files movie : ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర ఆసక్తిగా అదరగొడుతున్న లేటెస్ట్ చిత్రం “కాశ్మీర్ ఫైల్స్”. బాలీవుడ్ లో సైలెంట్ గా రిలీజ్ అయ్యి వైలెంట్ హిట్ అయ్యిన ఈ సినిమా విజయం కోసం మాట్లాడుకోవడం ఇంకా ఆగలేదని చెప్పాలి. హిందీలో మాత్రమే రిలీజ్ అయ్యిన ఈ సినిమా మాత్రం అని భాషల్లో కూడా హాట్ టాపిక్ గా నిలిచాయి వైరల్ అవుతుంది.
మరి ఈ సినిమా సెన్సేషన్ ఇప్పుడు ఒక్క ఇండియా లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎలా సాగుతుందో తెలుస్తుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 4,350 స్క్రీన్స్ లో ప్రదర్శితం అవుతుండగా ఈ కౌంట్ మరింత అవుతుందట. అంతేకాకుండా ప్రతి రోజు 11 వేల 200 కి పైగా షోలు ప్రదర్శితం అవుతున్నాయట.
మరి ఇందులో ఒక్క ఇండియాలోనే 4000 కి పైగా థియేటర్స్ లో అదరగొడుతున్న ఈ సినిమా మరిన్ని థియేటర్స్ లో యాడ్ అవుతుందట. అలాగే ఓవర్సీస్ లో 350 థియేటర్స్ దాటి ఇంకా స్క్రీన్స్ లో ఆడియెన్స్ డిమాండ్ చెయ్యడంతో విపరీతంగా పెంచుతున్నారట.
ఇప్పటికే భారీ వసూళ్లు కొల్లగొడుతున్న ఈ చిత్రం కొన్ని నిజజీవిత సంఘటనలు ఆధారంగా తెరకెక్కించగా బాలీవుడ్ నటులు అనుపమ్ ఖేర్ మరియు మిథున్ చక్రవర్తిలు ప్రధాన పాత్రల్లో నటించారు. హిందూ సాధువులపై జరిగిన ఊచకోత ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు పెను సంచలనంగా మారింది.