“అంటే సుందరానికి”తో నాని మళ్ళీ హిట్ కొట్టేశాడా? టాక్ ఎలా వచ్చింది?

Ante Sundaraniki

నేచురల్ స్టార్ నాని హీరోగా మలయాళ ముద్దుగుమ్మ టాలెంటెడ్ నటి నజ్రియా ఫహద్ హీరోయిన్ గా యంగ్ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా “అంటే సుందరానికి”. మంచి అంచనాలు నడుమ ప్రమోషన్స్, ముఖ్యంగా నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెషల్ గెస్ట్ గా చేసిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లుతో ఈ సినిమాపై మరింత పాజిటివ్ వాతావరణమే నెలకొంది.

అయితే మన తెలుగు స్టేట్స్ లో అంత మంచి బుకింగ్స్ నమోదు అవ్వకపోయినా యూఎస్ లో మాత్రం నాని సినిమాకి ఆడియెన్స్ లైన్ కట్టారు. అందుకే కాస్త ముందే టాక్ బయటకి రాగా దీనితో అయితే నాని మళ్ళీ హిట్ కొట్టాడనే వినిపిస్తుంది. ఈ సినిమా కాస్త ల్యాగ్ అయినా కూడా ఆడియెన్స్ ని మెప్పించి తీరుతుంది అని అంటున్నారు.

ఫస్ట్ షో నుంచే మంచి పాజిటివ్ టాక్ అయితే ఈ సినిమాకి దక్కగా ఆల్ మోస్ట్ అదే ఇప్పటి వరకు కొనసాగుతుంది. అయితే వసూళ్ల పరంగా అయితే ఈ చిత్రం గట్టెక్కుతుందో లేదో అనేది ఇప్పుడు అసలు ప్రశ్న. మార్నింగ్ షోస్ కాస్త డల్ గా ఉన్నా కూడా సాయంత్రంకి అయితే ఎలాగో టాక్ బాగుంది కాబట్టి బాగా పుంజుకునే అవకాశం ఉంది. మరి ఫైనల్ గా సుందరం టార్గెట్ ని రీచ్ అవుతాడో లేదో చూడాలి.