బిగ్ న్యూస్ : సామ్ కి ఏమైంది? వైరల్ అవుతున్న ఊహించని పోస్ట్.!

సౌత్ ఇండియా సినిమా స్టార్ హీరోయిన్ అయినటువంటి సమంత ఇప్పుడు హీరోయిన్ గా కన్నా తన ఫీమేల్ లీడ్ లో ఉన్న సినిమాలు సహా ఓటిటి షో లు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇలా సమంత నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో అయితే రిలీజ్ కి రెడీగా ఉన్న మొదటి పాన్ ఇండియా సినిమా “యశోద”.

ఇటీవల వచ్చిన ట్రైలర్ కూడా పాన్ ఇండియా లెవెల్లో భారీ రెస్పాన్స్ అందుకోగా సామ్ నటన కి కూడా మంచి పేరు వచ్చింది. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ ఈ ట్రైలర్ విషయంలో సమంత థాంక్స్ చెప్తూ చేసిన లేటెస్ట్ పోస్ట్ అయితే ఇపుడు అభిమానుల్లో వైరల్ గా మారింది.

తాను గత కొన్నాళ్ల నుంచి శరీర కండరాల సమస్యలతో బాధపడుతున్నానని అంతే కాకుండా కొన్నాళ్లుగా దానికి చికిత్స కూడా తీసుకుంటున్నానని చెప్పింది. అయితే అసలు సామ్ అలా కనిపించినట్టు కూడా ఎవరికీ అనిపించలేదు.

కానీ లేటెస్ట్ గా తాను చికిత్స పొందుతున్న హాస్పిటల్ బెడ్ పై నుంచి మాస్క్ పెట్టుకొని ఉన్న తన ఫోటోని షేర్ చేసింది. అయితే ఈ న్యూస్ ని నాకు పూర్తిగా తగ్గాక చెపుదాం అనుకున్నాను కానీ ఇప్పుడు పూర్తిగా రికవర్ అవ్వడానికి సమయం పడుతుంది అని వైద్యులు చెప్పగా.. 

అందుకే ఇప్పుడే చెప్తున్నానని సమంత తెలిపింది. అలాగే దీనితో పాటుగా తాను ఎన్నో రోజులు నుంచి మంచి చెడు, ఫిజికల్ గా మెంటల్ గా కూడా ఎన్నో ఎదుర్కొంటున్నానని తప్పకుండా పూర్తిగా కోలుకుంటానని సమంత అయితే తెలిపింది.