అక్కినేని కోడలిగా సమంతకు ఉన్నతమైన స్థానం కట్టబెట్టారు టాలీవుడ్ సినీ జనం. అయితే, రీసెంట్‌గా ఆ బంధాన్ని చైతూతో విడాకులు తీసుకోవడం ద్వారా సమంత తెంచేసుకున్న సంగతి తెలిసిందే. అక్కినేని ఫ్యామిలీతో బంధం తెగిపోయాకా సమంత పని అయిపోయిందంటూ ఓ వర్గం నెటిజన్లు నెట్టింట ప్రచారం మొదలెట్టారు.
దాంతో సమంత ఫైనాన్షియల్ స్టేటస్ వైపు ఫోకస్ మళ్లింది. గుసగుసల ప్రకారం, సమంత ఫైనాన్షియల్ స్టేటస్ అంత వీక్‌గా ఉందా.? అని ఆరా తీయగా, అదేం లేదని తేలిపోయింది. సమంత స్టార్ హీరోయిన్. స్వతహాగా చాలా తెలివైంది. సో, వెనకేసుకోవల్సినంత బాగానే వెనకేసుకుందని కొందరు అంటున్నారు.
అంతేకాదు, ఓ వైపు హీరోయిన్‌గా సినిమాలు చేస్తూనే, సైడ్ బిజినెస్ వైపు కూడా సమంత కొన్ని పెట్టుబడులు పెట్టింది. అందులో భాగంగా ‘సాకి’ అనే బ్రాండ్’తో సొంత బిజినెస్ స్టార్ట్ చేసింది. దాన్ని బాగా డెవలప్ చేసుకుంది కూడా. అలాగే, పలు ప్రొడక్ట్‌లకు సమంత బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించింది. ఆ యాంగిల్‌లోనూ సమంత సంపాదన టాప్ అనే చెప్పాలి. సో ఎలా చూసుకున్నా ఫైనాన్షియల్‌గా సమంత సూపర్ సౌండ్ అనే చెప్పాలి.