Bebamma Krithi Shetty : బేబమ్మా.. కాస్త తగ్గాలమ్మా.! ఇలాగైతే ఎలాగమ్మా.!

Bebamma Krithi Shetty

Bebamma Krithi Shetty :  తొలి సినిమాతోనే బేబమ్మగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కృతి శెట్టి. పల్లెటూరి అమ్మాయిగా పరిచయమై, అంచెలంచెలుగా తనలోని గ్లామర్ యాంగిల్స్‌ని బయట పెడుతోంది ముద్దుగుమ్మ కృతిశెట్టి. యూత్‌లో బేబమ్మగా తెచ్చుకున్న క్రేజ్ ఆమెకు వరుస ఆఫర్లు వచ్చేలా చేస్తోంది.

ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలు కృతిశెట్టి చేతిలో వున్నాయ్. అయితే, ‘శ్యామ్ సింఘరాయ్’ సినిమాలో బేబమ్మ క్యూట్ లుక్స్‌తో పాటు, హాట్ అప్పీల్ కూడా కాస్త ఎక్కువే చేసింది.

స్మోకింగ్ చేసింది. అవసరానికి మించి ఎక్స్‌పోజింగ్ కూడా చేసేసింది. అందుకే ఈ సినిమాలో బేబమ్మ కాస్త ఎబ్బెట్టుగా కనిపించిందన్న అభిప్రాయాలున్నాయి. అఫ్‌కోర్స్ ఇప్పుడు యూత్ ఎట్రాక్ట్ అవ్వాలంటే ఆ మాత్రం వుండాలనుకోండి. కానీ, బేబమ్మ స్కిన్ షో అవసరానికి మించి అన్నట్లుగా వుందంటూ, నెట్టింట కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

సోషల్ మీడియా రెస్పాన్స్ బట్టి, బేబమ్మ ఇకపై మరీ అంతటి గ్లామర్ షోకి ఒప్పుకోకూడదని అనుకుంటోందట. జస్ట్ అనుకుంటే ఫర్వాలేదు. కానీ, గట్టిగా డిసైడ్ అయితే, మాత్రం చిక్కుల్లో పడ్డట్లే. స్కిన్ షోకి దూరం అంటే, అవకాశాలు కూడా దూరమయ్యే ప్రమాదం వుంది.

సో, బేబమ్మ కాస్త ఆచి తూచి వ్యవహరించి నిర్ణయం తీసుకుంటే మంచిదని ఆమె అభిమానులు, సన్నిహితులు సూచిస్తున్నారట.