Vishnu Vishal: ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఒకరి సినిమాలలో ఒకరు గెస్ట్ రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మంచి స్టార్ డం ఉన్న సీనియర్ హీరోలు, పాన్ ఇండియా హీరోలు గెస్ట్ రోల్ చేస్తే అభిమానులు సినిమాల థియేటర్లకు ఇంకా ఎక్కువగా వస్తారని భావిస్తున్నారు మూవీ మేకర్స్. ఇలా ఈ మధ్యకాలంలో గెస్ట్ రోల్ లో చేసిన సినిమాలు చాలానే విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే గెస్ట్ రోల్ అయితే పర్లేదు కానీ రోల్ సమయం మరింత పెరిగితే మొదటికే మోసం వస్తుంది.
అయితే అచ్చం ఇలాంటి సంఘటనే లాల్ సలాం సినిమాకు జరిగిందని చెప్పాలి. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో విష్ణు విశాల్, విక్రాంత్ మెయిన్ లీడ్స్ గా నటించారు. ఇందులో రజినీకాంత్ గెస్ట్ రోల్ చేశారు. అయితే ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. లాల్ సలాం మూవీ గత సంవత్సరం రిలీజ్ అయ్యింది. భారీ ఫ్లాప్ గా నిలిచింది. అయితే తాజాగా హీరో విష్ణు విశాల్ ఈ సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ సందర్భంగా హీరో విష్ణు విశాల్ మాట్లాడుతూ.. లాల్ సలాం సినిమాలో నేనే హీరోని. రజినీకాంత్ గారిది 25 నిమిషాల రోల్. కానీ ఆ తర్వాత స్క్రిప్ట్ చేంజ్ అయి అది మారిపోయి ఆయనది ఒక గంట రోల్ అయింది. దాంతో అది ఆయన సినిమాగా మారింది. ప్రేక్షకులు కూడా అందరూ రజనీకాంత్ సినిమా అనుకున్నారు. రజినీకాంత్ గారి సినిమాలో నేను నటించినందుకు సంతోషమే కానీ అది బాక్సఫీస్ వద్ద ఫ్లాప్ అయింది అని తెలిపారు హీరో విష్ణు విశాల్.
