Saamanyudu Official Trailer : విశాల్ మాస్ యాక్షన్ ‘సామాన్యుడు’ ట్రైలర్!

Saamanyudu Official Trailer :తమిళస్టార్ విశాల్ నటిస్తున్న ‘సామాన్యుడు’ ట్రైలర్ బుధవారం సాయంత్రం రిలీజ్ చేశారు. తెలుగులో మంచి ఫాలోయింగున్న విశాల్ ప్రతీ తమిళ సినిమా తెలుగులో విడుదలవుతూ వస్తోంది. అందులో తాజాగా వస్తున్న ‘సామాన్యుడు’ భిన్నంగా వుంది. నేరప్రపంచంలో ఇరుక్కున్న సామాన్యుడు విశాల్ సూపర్ మాస్ యాక్షన్ మూవీగా ఈ ట్రైలర్ వుంది.

‘నీకో మంచి క్రైమ్ స్టోరీ చెప్పనా?’ అన్న విశాల్ డైలాగుతో ప్రారంభమవుతుంది… ‘తన ప్రాణాలు కాపాడుకోవడానికి వేరే దారి లేక హత్య చేసే వాడికీ, మిగతా వారిని చంపి తను బతకాలనుకునే వాడికీ చాలా తేడా వుంది’ – అంటూ ప్రాణమున్న ఒక శవం, ఇంకో ప్రాణం లేని శవం చూపిస్తూ యాక్షన్ మొదలైపోతుంది.

Saamanyudu Official Trailer | Vishal | Yuvan Shankar Raja | Thu.Pa.Saravanan

 

సామాన్య ప్రజల హక్కుల కోసం పోరాడే సాధారణ వ్యక్తిగా విశాల్ ని చూపిస్తూ దృశ్యాలు వస్తాయి. మధ్యలో హీరోయిన్ డింపుల్ హయాతీతో సెక్సీ రోమాంటిక్ సీను వేడి పుట్టిస్తుంది. విశాల్ ని పోలీసు జాబ్ లో చేరవద్దని కమెడియన్ యోగిబాబు ప్రాథేయ పడడం వుంటుంది.

సమాజంలో బలహీనుల్ని బాధించే బలవంతులైన నేరస్థులపై ఒక సామాన్యుడి దండయాత్రే ఈ మూవీ అని తెలుస్తోంది. దర్శకుడు తు. పా. శరవణన్ కమర్షియల్ అంశాలన్నీ కలిపి ఈ మాస్ యాక్షన్ తీశాడు. మాస్ చేత కేరింతలు కొట్టించే విశాల్ ఫైట్స్, కవిన్ రాజ్ ఛాయాగ్రహణం, యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పకడ్బందీగా వున్నాయి. రెడ్ అండ్ బ్లూ టీంట్ తో విజువల్స్ విబిన్న లుక్ తెచ్చాయి. విశాల్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తారు.