Virata Parvam: విరాట పర్వం నుండి “ది వాయిస్ ఆఫ్ రవన్న విడుదల”

Virata Parvam: వరుస ప్రాజెక్ట్స్‌తో ఫుల్‌ బిజీగా ఉన్నారు హీరో దగ్గుబాటి రానా. విలక్షణ నటుడు రానా, నేచురల్‌ బ్యూటీ సాయి ప‌ల్ల‌విప్ర‌ధాన పాత్ర‌ల్లో జంటగా నటిస్తున్నచిత్రం ‘విరాట పర్వం’. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇవాళ రానా పుట్టినరోజు సందర్భంగా ది వాయిస్ ఆఫ్ రవన్న పేరుతో ఓ వీడియో రిలీజ్ చేసింది చిత్రబృందం. మావోయిస్టు నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కుస్తున్నారు చిత్రబృందం.

విప్లవాత్మకమైన ప్రేమకథగా వస్తున్న ఈ సినిమాలో రానా కామ్రేడ్‌ రవన్నగా నటిస్తున్నాడు. ప్రియమణి, నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. విరాటపర్వం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ద‌గ్గుబాటి సురేశ్ బాబు, సుధాక‌ర్‌ చెరుకూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు.