Virat Kohli: సోషల్ మీడియాలో ఒక్కో పోస్టుకు కోహ్లీ ఎంత తీసుకుంటారో తెలుసా..టాప్ లో కొనసాగుతున్న విరాట్..!

Virat Kohli: విరాట్ కోహ్లీ.. టీం ఇండియా టెస్టు కెప్టెన్. స్పోర్ట్ పై అవగాహన ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ పేరు సుపరిచితమే. అయితే అతడు తన ఆటతీరులో సచిన్ టెండూల్కర్ ను తలపిస్తుంటాడని చాలామంది అంటుంటారు. అంతే కాకుండా.. అతడి సెంచరీలు, హాఫ్ సెంచరీల రికార్టులు కూడా సచిన్ కు దగ్గర్లోనే ఉన్నాయి.
త్వరలో సచిన్ పేరిట ఉన్న ఆ రికార్డులు చెరిపేసే సత్తా టీం ఇండియాలో కేవలం విరాట్ మాత్రమే ఉందనేది క్రికెట్ విశ్లేషకుల మాట. ఇదిలా ఉండగా.. కోహ్లీ ఒక్క ఆటతీరులోనే కాదు సంపాదనలో కూడా అందరికంటే ముందు ఉంటుంన్నాడు.

వ్యాపార ప్రచారం కోసం పలు కంపెనీలకు బ్రాడ్ అంబాసిడర్ గా, వ్యాపార ప్రకటనల్లో ఇతను కనిపిస్తుంటారనే సంగతి తెలిసిందే. అయితే..ఇన్ స్ట్రాగ్రామ్ లో ఏదైనా వ్యాపార ప్రచారం కోసం చేసే ఒక్కో పోస్టుకు రూ. 5 కోట్లకు పైగా తీసుకుంటున్నారని తేలింది. 680,000 డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు 5.08 కోట్లు. క్రికెటర్లలో ఇతనే అగ్రస్థానంలో ఉన్నట్లు సమాచారం. ఇక కోహ్లీ తనకు ఫ్యామిలీకి సంబంధించి ఏ విషయాన్ని అయినా ఇన్ స్టా వేదికగా పంచుకుంటాడు. తాజాగా తన కూతురు వామికకు సంబంధించిన ఫొటోలను కూడా ఇన్ స్టా వేదికగా పంచుకున్నాడు. ఇక తన భార్య బాలీవుడ్ నటి అనుష్క శర్మ కూడా సోషల్ మీడియా ద్వారా బాగానే సంపాదిస్తున్నారు. గతేడాది టాప్‌-20లో ఉన్న సెలబ్రిటీల్లో టీమిండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఒక్కడికే చోటు దక్కింది.

ఇక కోహ్లీను ఇన్ స్ట్రా గ్రామ్ ను 177 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. ఈ జాబితాలో ఫుట్ బాల్ దిగ్గజం ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో ఉన్నారు. అతడిని 388 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇతను ఒక్కో పోస్టుకు దాదాపు రూ. 11 కోట్లు తీసుకుంటున్నారని కొన్ని సంస్థలు వెల్లడించాయి. మరో ఫుట్ బాల్ దిగ్గజం మెస్సి కూడా దాదాపు రూ.8 కోట్లలకు పైగా తీసుకుంటారట.