Pushpa Makers Big Mistake : “పుష్ప”లో బిగ్ మిస్టేక్ వైరల్.. రష్మికా పేరుని ఇలా మార్చేశారేంటి గురూ?

Pushpa Makers Big Mistake : టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని కాస్తా మాస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మార్చేసిన లేటెస్ట్ భారీ సినిమా “పుష్ప”. గత నెల థియేటర్స్ లో భారీ హిట్ గా నిలిచి ఇప్పుడు సౌత్ భాషల్లో ఓటిటి రిలీజ్ అయ్యి మళ్ళీ అదే భారీ రెస్పాన్స్ ని అందుకుంటుంది. అయితే ఈ సినిమాలో మొట్ట మొదటి సారిగా టాలీవుడ్ లక్కీ బ్యూటీ రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించింది.

మొదట్లో ఈమె ఎంపిక పట్ల చాలా నెగిటివిటీ వచ్చినా ఆ తర్వాత రష్మికా ఈ సినిమాలో పర్ఫెక్ట్ గా సెట్టయ్యింది అని అంతా ప్రశంసించారు. ఇక అలాగే ఈ సినిమాలో తన రోల్ కూడా మంచి కీలకంగా కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఓ పక్క గ్లామర్ షో చేస్తూనే ఇంకో పక్క బన్నీ సరసన శ్రీవల్లి గా అదరగొట్టింది.

అయితే ఈ సినిమా విషయంలో మేకర్స్ చేసిన ఓ ఫన్నీ బిగ్ మిస్టేక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా మొత్తం అయ్యాక టైటిల్స్ రోల్ అవుతాయి కదా అక్కడ రష్మిక పేరునే మార్చేశారు. అందులో రష్మికా మందన్నా అని బదులు రష్మికా “మడోనా” అని పెట్టారు. దీనితో సినిమాలో పేరు ఇలా మార్చేశారేంటి అని ట్రోల్స్ ఓ రేంజ్ లో పడుతున్నాయి. మేకర్స్ ఇలాంటి చూసుకోవాలి మరి..