విక్రాంత్ హీరోగా పరిచయమవుతున్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పార్క్’. ఛార్మింగ్ బ్యూటీస్ మెహ్రీన్ ఫిర్జాదా, రుక్సర్ థిల్లాన్ ఇందులో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ అన్‌కాంప్రైజ్డ్‌గా సినిమాను రూపొందిస్తోంది. అనౌన్స్మెంట్ రోజునే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీలో టాలెంటెడ్ యాక్టర్, ‘మిన్నల్ మురళి’ ఫేమ్ గురు సోమసుందరం విలన్‌గా నటిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు తెలియజేస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. అరవింద్ కుమార్ రవి వర్మ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రవి వర్మ ఇంతకు మునుపు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు కాబట్టి సినిమాటోగ్రఫీని కూడా హ్యాండిల్ చేస్తున్నారు. ‘ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అక్టోబర్ 3 నుంచి ఐస్‌ల్యాండ్‌లో షూటింగ్ జరగనుంది. ఆ తర్వాత మున్నార్, వైజాగ్ల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో వేసిన రెండు భారీ సెట్స్‌లో షూటింగ్ జరుగుతోంది. ‘హృదయం’ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకు ట్యూన్స్ అందిస్తున్నారు. ఇప్పటికే ఆడియన్స్ లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తోంది స్పార్క్. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో కీ రోల్స్ కోసం రీసెంట్గా వెర్సటైల్ ఆర్టిస్ట్ నాజర్, సుహాసిని మణిరత్నం జాయిన్ అయ్యారు. వీరితో పాటు వెన్నెల కిశోర్, షాయాజీ షిండే, సత్య, శ్రీకాంత్, కిరణ్ అయ్యంగార్, అన్నపూర్ణమ్మతో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.