SSMB29: టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, అలాగే స్టార్ డైరెక్టర్ రాజమౌళికి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. SSMB29 టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్ స్ఫూర్తి అయిన విషయం తెలిసిందే. త్వరలోనే మూడవ షెడ్యూల్ కూడా ప్రారంభం కానుంది. ఈ సినిమా అసలు ఇంకా పట్టాలెక్కకముందే ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఏర్పడ్డాయి. ఈ మూవీని హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ రాజమౌళి. దానికి తోడు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వినిపించిన వార్తలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి.
అయితే మహేష్ బాబు రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమా కోసం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా మంది అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయంపై సరైన స్పష్టత లేదు. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా మూవీ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాలో పలువురు సెలబ్రిటీలు నటిస్తున్నారు అంటూ కొందరి పేర్లు వినిపించిన విషయం తెలిసిందే.
అందులో భాగంగానే స్టార్ హీరో విక్రమ్ ని కూడా ఇందులో కీలక పాత్ర కోసం ఎంపిక చేశారట. కానీ హీరో విక్రమ్ ఆఫర్ ని చాలా సున్నితంగా రిజెక్ట్ చేశారట. సినిమాలో విలన్ పాత్ర కావడంతో అందుకు నో చెప్పినట్టు తెలుస్తోంది. అయితే విక్రమ్ రిజెక్ట్ చేసిన పాత్రలో పృథ్విరాజ్ సుకుమారన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాతో మహేష్ బాబు ని గ్లోబల్ స్టార్ గా మార్చాలని చూస్తున్నారు డైరెక్టర్ రాజమౌళి. ప్రస్తుతం ఆ ప్రయత్నంలోనే ఆయన ఉన్నారు.