టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నా…ఆయన కుమారుడు లోకేష్ అన్నా వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి ఒంటికాలుపై లేచి పడతారని చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియా వేదికగా తండ్రీ కోడుకులిద్దరిపై విజయసాయి ఎన్నోసార్లు నిప్పులు చెరిగారు. ప్రతిగా విజయసాయిపై ఫాదర్ అండ్ సన్ కూడా అదే స్థాయిలో కౌంటర్లు వేసారు. ట్విటర్ వేదికగా ఈ ముగ్గురి మధ్య వివాదాస్పద వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు సంచలనంగానే ఉంటాయి. ఈనేపథ్యంలో తాజాగా మరోసారి విజయసాయి చినబాబుపై చెలరేగిపోయారు.
తాడి పత్రి వచ్చి ఏం ఇరగదీశాడని ఆ పార్టీ కార్యకర్తలే విసుక్కుంటున్నారుట. 16 రకాల వంటకాలు చేయించుకుని సుష్టిగా భోజనం చేసి చెక్కేసాడని తెలుగు తమ్ముళ్లు తిట్టుకుంటున్నారు. పేరుకే పరామర్శలు, పలకరింపులు, రుచికరమైన ఫుడ్ దొరికిందంటే ఎంత దూరమైనా వెళ్లొస్తాడు మాలోకం అని ట్వీట్ చేసారు. మరో ట్వీట్ లో చంద్రబాబు పై దాడి చేసారు. గంటలకు 5 లక్షలు ఫీజు తీసుకునే ఢిల్లీ అడ్వకేట్ల ఇళ్ల ముందు క్యూలు కడుతున్నారుట. తెలుగుదేశం మాజీలు. బాబు బీజేపీలోకి పంపిన కోవర్టులు బాస్ కోసం అదే పనిలో బిజీగా ఉన్నారుట. ఈయన కాపాడలేడు అనుకున్నారేమో! ఎవరికి వారు లాయర్లకు అడ్వాన్సులిచ్చి గండం నుంచి బయట పడేయమని ప్రాధేయపడుతున్నారుట అని ట్వీట్ చేసారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి ఆరెస్ట్ ల నేపథ్యం లోకేష్ తాడిపత్రి పరామర్శకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇరువుర్నీ అరెస్ట్ చేసి కడప జైలుకు తరలించడం..వార్ని కలిసే అవకాశం లేకపోవడంతో లోకేష్ తాడిపత్రి నుంచి వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఇక టీడీపీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి ల కేసును కోర్టులో వాదించడానికి చంద్రబాబు అనుభవం గల లాయర్ల కోసం వేటలో ఉన్నారు. ఆ రెండు సందర్భాల్ని ఉదహరించే విజయసాయి అలా చెలరేగారు.
తాడిపత్రి వచ్చి ఏం ఇరగదీశాడని ఆ పార్టీ కార్యకర్తలే విసుక్కుంటున్నారంట. 16 రకాల వంటకాలు చేయించుకుని సుష్టిగా భోంచేసి చెక్కేశాడని తెలుగు తమ్ముళ్లు తిట్టుకుంటున్నారు. పేరుకే పరామర్శలు, పలకరింపులు. టేస్టీ ఫుడ్ దొరుకుతుందంటే ఎంత దూరమైనా వెళ్లొస్తాడు మాలోకం.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 18, 2020