విజయ్ సేతుపతి ఖాతాలోకి కమల్ హాసన్ సినిమా

Vijay Sethupathi turns villain for Kamal Hassan
Vijay Sethupathi turns villain for Kamal Hassan
తమిళంలో అత్యంత బిజీగా ఉన్న హీరో కమ్ నటుడు ఎవరూ అంటే విజయ్ సేతుపతి.  తమిళంలోనే కాదు తెలుగు, హిందీ లాంటి ఇతర భాషల్లో కూడ సేతుపతికి ఫుల్ డిమాండ్ ఉంది. డేట్స్ కేటాయించలేక విజయ్ సేతుపతి ఆమిర్ ఖాన్ లాంటి స్టార్ హీరోల సినిమాలను వదులుకున్నారు కూడ. ఎంత బిజీగా ఉన్నా తమిళ సినిమాలకు మాత్రం మొదటి ప్రాధాన్యమిస్తూ అక్కడ సినిమాలకు ఓకే చెప్తున్నారు ఆయన.  తమిళ దర్శకులు అయితే ఆయనలో ప్రతినాయకుడిని వెతుక్కుంటున్నారు.  ఇప్పటికే విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాలో విలన్ పాత్ర చేసి మెప్పించిన సేతుపతికి అలాంటి ఆఫర్ మరొకటి వచ్చింది.  
 
విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న కొత్త సినిమా ‘విక్రమ్’.  ఇందులో ప్రతినాయకుడి పాత్ర కోసం విజయ్ సేతుపతిని అప్రోచ్ అయ్యాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్.  సుదీర్ఘమైన చర్చల అనంతరం సేతుపతి ఆ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.  త్వరలో మొదలుకానున్న షూటింగ్లో ఆయన కూడ పాల్గొననున్నారు. నటుడిగా కమల్ హాసన్ స్థాయి ఏంటో అందరికీ తెలుసు.  ఆయనతో కలిసి నటించడం అందునా ప్రతినాయకుడి పాత్ర చేయడమంటే గొప్ప విషయమే.  అలాంటి ఆవకాశం విజయ్ సేతుపతికి దక్కింది.  సేతుపతి ఎలాగూ తన పాత్రకు న్యాయం చేసి తీరుతాడు.  అందులో అనుమానమే లేదు.  చూడాల్సిందల్లా కమల్, సేతుపతి కాంబినేషన్ ఆన్ స్క్రీన్ మీద ఎంత భీభత్సంగా ఉంటుంది అనేదే.