వంటల కార్యక్రమంలో విజయ్ సేతుపతి.. ఎంత పుచ్చుకున్నాడో !

Vijay Sethupathi to host Tamil cooking show
Vijay Sethupathi to host Tamil cooking show
 
విజయ్ సేతుపతి.. దక్షిణాదిన ఫుల్ బిజీగా ఉన్న ఏకైక నటుడు.  హీరోగా, ప్రతినాయకుడిగా, అతిధి పాత్రలకుగాను ఆయన వద్ద పదుల సంఖ్యలో ఆఫర్లు ఉన్నాయి.  తమిళం, తెలుగులోనే కాదు హిందీ నుండి కూడ ఆయనకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.  ఆమిర్ ఖాన్ లాంటి స్టార్ సేతుపతితో తన సినిమాలో ఒక కీ రోల్ చేయించాలని అనుకున్నారంటే సేతుపతి క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అంచనా వేయవచ్చు.  ఏడాదిలో కనీసం 10 సినిమాల్లో కనిపించే సేతుపతి కేవలం డేట్స్ అడ్జెస్ట్ చేయలేక వదులుకున్న పెద్ద సినిమాలు చాలా ఉన్నాయి.  వాటిలో ఆమిర్ ఖాన్ చిత్రం కూడ ఉంది.  
 
ఇప్పుడున్న పరిస్థితుల్లో సేతుపతి డేట్స్ పట్టుకోవడం అంటే పెద్ద విశేషమే.  కొన్ని నెలలు ఎదురుచూస్తే తప్ప ఆయన దొరకడు.  ఇలా సినిమాలు చేయడానికే తీరిక దొరకని సేతుపతి ఒక వంటల కార్యక్రమం కోసం డేట్స్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సన్ టీవీ నుండి ప్రసారం కాబోయే మాస్టర్ చెఫ్ అనే కార్యక్రమానికి సేతుపతి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.  మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా అనే కార్యక్రమం తరహాలో ఈ తమిళ కార్యక్రమం ఉంటుందట.  ఇంత బిజీ షెడ్యూల్లో కూడ సేతుపతి వంటల కార్యక్రమం కోసం టైమ్ కేటాయించారు అంటే ఆయనకు పారితోషకం ఏ స్థాయిలో అంది ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.