ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 సినిమాలు చేస్తున్నాడు విజయ్

Vijay Sethupathi doing 25 plus projects
Vijay Sethupathi doing 25 plus projects
దక్షిణాదిన అత్యంత బిజీ స్టార్ ఎవరు అంటే అనుమానం లేకుండా విజయ్ సేతుపతి అనొచ్చు.  హీరోగానే సెటిలవ్వాలనే గిరి గీసుకోకుండా నటుడిగా ఎలాంటి పాత్రలు వచ్చినా చేస్తూ వెళ్తున్నారు విజయ్ సేతుపతి.  అదే ఆయనకు ప్లస్ అయింది. సినిమాల్లో ఏవైనా స్పెషల్ రోల్స్ రాసుకునేవారు విజయ్ సేతుపతినే అప్రోచ్ అవుతున్నారు. తమిళంలోనే కాదు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో కూడ ఆయనకు ఆఫర్లు వస్తున్నాయి.  ఆమిర్ ఖాన్ లాంటి స్టార్ హీరోనే విజయ్ సేతుపతి కోసం ఎంతో ట్రై చేశారు అంటే ఆయన క్రేజ్ ఎలాంటిదో అర్థమవుతోంది. 
 
ఇప్పటికప్పుడు విజయ్ సేతుపతి ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ సంఖ్య చూస్తే 25కు పైమాటే.  వాటిలో హీరోగా చేస్తున్న సినిమాలతో పాటు సపోర్ట్ రోల్స్ చేస్తున్న సినిమాలు ఉన్నాయి.  తెలుగు, హిందీ భాషల్లో కూడ ఆయన చిత్రాలు చేస్తున్నారు. నటించడమే కాదు కొన్ని సినిమాలకు రచయితగా, నిర్మాతగా కూడ వ్యవహరిస్తున్నారు ఆయన.  అంతేకాదు వీటిలో ఒక టీవీ షో కూడ ఉంది.  వీటికే డేట్స్ సరిపోక చాలా సినిమాలను వదులుకున్నారు ఆయన.  మొత్తం మీద ఇంకో రెండేళ్ల వరకు ఖాళీ లేనంత బిజీగా ఉన్నారు సేతుపతి.