దక్షిణాది స్టార్ హీరోయిన్స్‌లో నయనతార రూటే సపరేట్. ఇద్దరితో పీకల్లోతు ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ చివరకు దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో సెటిల్ అయింది. 2015లో విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో రూపొందిన ‘నానుం రౌడీ తాన్’ సినిమాలో నయనతార హీరోయిన్ కాగా, ఆ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. దాదాపు ఐదేళ్ళ నుండి డేటింగ్‌లో ఉన్న ఈ జంట పెళ్లి పీటలు ఎప్పుడెక్కుతారా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు.
కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న నయనతార,విఘ్నేష్ శివన్ లు వీలున్నప్పుడల్లా విహార యాత్రలకు వెళుతూ వాటికి సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. ఇవి ఇక చాలు త్వరగా పెళ్ళి చేసుకోండని నెటిజన్స్ సలహా ఇస్తున్నప్పటికీ వారు మాత్రం తమ పెళ్ళిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. 2020లోనే నయనతార పెళ్లి జరగనుందనే టాక్స్ వినిపించినప్పటికీ కరోనా వలన అది సాధ్యం కాలేదు. ఇప్పుడు 2021లో నయన్- విఘ్నేష్ ల పెళ్లి జరగడం ఖాయం అంటున్నారు.
ఇక ఆలస్యం చేస్తే బావుండదని భావించిన రెండు కుటుంబాల వారు మార్చిలో వీరికి పెళ్లి చేయాలని అనుకుంటున్నారట. క్రిస్టియన్, హిందూ పద్ధతుల్లో విఘ్నేశ్ శివన్, నయనతార పెళ్లి జరగనుందని సమాచారం. ఈ వివాహానికి పరిమిత సంఖ్యలో స్నేహితులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతారని టాక్. ప్రస్తుతం నయన తార ఇటు తెలుగు, తమిళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు తన భర్తతో కలిసి నిర్మాణం వైపు కూడా అడుగులేస్తుంది.పర్సనల్ లైఫ్‌లోను, ప్రొఫెషనల్‌గాను ఇద్దరి జీవితాలు బాగుండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.