దిల్ రాజ్ దెబ్బకు కళ్ళు తెరిచిన వేణు శ్రీరామ్

Venu Sriram finds new way
Venu Sriram finds new way
 
లాక్ డౌన్ అనంతరం హిట్ అందుకున్న దర్శకుల్లో వేణు శ్రీరామ్ ఒకరు.  పవన్ కళ్యాణ్ హీరోగా ఆయన చేసిన ‘వకీల్ సాబ్’ అభిమానుల్ని మెప్పించింది.  మాస్ ప్రేక్షకులకు వేణు శ్రీరామ్ వర్క్ బాగా నచ్చింది.  దీంతో ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు ఎప్పుడో ఆగిపోయిన ‘ఐకాన్’ సినిమాను బయటకు తీశారు.  అల్లు అర్జున్ ఈ చిత్రంలో హీరో.  ఆగిపోయింది అనుకున్న ఈ సినిమా తప్పకుండా జరుగుతుందని దిల్ రాజు బల్లగుద్ది చెప్పారు.  పెద్ద సినిమా కావడంతోవేణు శ్రీరామ్ సైతం దిల్ రాజు కాంపౌండ్లోనే ఇంకొన్నాళ్లు ఉండాలని అనుకున్నారు.  కానీ పరిస్థితులు తారుమారయ్యాయి.  ‘ఐకాన్’ తప్పకుండా చేయాలనే కమిట్మెంట్ అల్లు అర్జున్ లో కనబడలేదు.  
 
దిల్ రాజు సైతం శంకర్, రామ్ చరణ్ సినిమా పనుల్లో బిజీ అయ్యారు.  సిట్యుయేషన్ చూస్తే ‘ఐకాన్’ మొదలవ్వడానికి ఇంకో ఏడాది పైగానే పట్టేలా ఉంది.  అసలు ఖచ్చితంగా స్టార్ట్ అవుతుందనే నమ్మకం కూడ లేదు.  అందుకే వేణు శ్రీరామ్ వేరే దారి చూసుకున్నాడు.  కొత్త కథను సిద్దం చేసుకుంటున్నాడు.  ఆ కథను స్టార్ హీరోకు చెప్పే ప్రయత్నాల్లో ఉన్నారు.  ఆయనతో సినిమాను నిర్మించడానికి స్టార్ ప్రొడ్యూసర్ ఒకరు రెడీగా ఉన్నారట.  త్వరలోనే ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.  మొత్తానికి వేణు శ్రీరామ్ దిల్ రాజుతో పెట్టుకుంటే పని కాదని గట్టిగా డిసైడయ్యారన్నమాట.