‘నారప్ప’ను అమ్మేశారు.. రిలీజ్ డేట్ కూడ కన్ఫర్మ్

Venkatesh's Narappa sold to Amazon Prime
Venkatesh's Narappa sold to Amazon Prime
విక్టరీ వెంకటేష్ ఎంతో ఇష్టపడి చేసిన చిత్రం ‘నారప్ప’.  తమిళ చిత్రం ‘అసురన్’ చూడగానే రీమేక్ చేయాలని నిర్ణయించుకున్న వెంకటేష్ వెంటనే సురేష్ బాబును రంగంలోకి దింపి రీమేక్ రైట్స్ కొనిపించేశాడు. 
 
ఆ తర్వాత దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాలను ఎంచుకుని వెంటనే షూటింగ్ మొదలుపెట్టేశాడు. లాక్ డౌన్ మూలంగా షూటింగ్ ఆలస్యం అయినప్పటికీ ఇటీవలే ప్యాచ్ వర్క్ సహా మొత్తం ముగించారు. వెంకటేష్ ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. 
 
రియలిస్టిక్ పెర్ఫార్మన్స్ చూపించే స్కోప్ చాన్నాళ్ళకు దొరకడంతో ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేయాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. వెంకటేష్ షూటింగ్ చేసిన విధానం చూస్తే సినిమా మీద ఆయన ఎంతలా ప్రాణం పెట్టుకున్నారో తెలుస్తుంది.
 
సురేష్ బాబు సైతం సినిమాను భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ థియేటర్లు ఓపెన్ అయినా ప్రేక్షకులు రావడానికి ధైర్యం చేస్తారో చేయరో అనే సందేహం, తగ్గిన టికెట్ ధరలతో డిస్ట్రుబ్యూటర్లు సినిమాను చెప్పినంత రేటుకు కొంటారో లేదో అనే మీమాంసలో పడిపోయారు.  ఇదే టైంలో ఓటీటీల నుండి మంచి ఆఫర్స్ రావడంతో వాటికే సినిమాను విక్రయించడం మంచిదని డిసైడ్ అయ్యారు ఆయన. 
 
అందుకే అమెజాన్ ప్రైమ్ ఓటీటీకి ‘నారప్ప’ను అమ్మేశారట. జూలై 24వ తేదీన సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. అయితే వెంకటేష్ అభిమానులు మాత్రం సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇదే కాదు తన నిర్మాణంలో రూపొందుతున్న ఇతర సినిమాలైన ‘విరాటపర్వం, దృశ్యం-2’లను కూడ ఓటీటీకే ఇచ్చేస్తున్నారు సురేష్ బాబు.