అభిమానులను క్షమాపణలు కోరిన నారప్ప

Venkatesh said sorry to his fans

విక్టరీ వెంకటేష్ తన అభిమానులకు క్షమాపణలు తెలియచేసారు. వెంకటేశ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన సినిమా “నారప్ప”. తమిళ్‏లో సూపర్ హిట్ సాధించిన “అసురన్” మూవీకి తెలుగు రీమేక్‏గా ఈ చిత్రాన్ని రూపొందించారు. మొదట థియేటర్స్లోనే విడుదల చేయాలనుకున్నప్పటికీ చివరికి ఈ మూవీ ఈ నెల 20 న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా శనివారం మీడియాతో మాట్లాడిన వెంకటేష్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

వెంకీ మాట్లాడుతూ… “మొదటిగా నేను ధనుష్, కి వెట్రిమారన్ కి కంగ్రాట్స్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన హార్డ్ హిట్టింగ్ ఎమోషన్స్ ఉన్న సినిమా ఇచ్చినందుకు. ఇది చూసిన వెంటనే నాకు చాలా నచ్చేసింది నాకే ఛాలెంజింగ్ గా ఉంటుంది అనిపించి రీమేక్ కు ఓకే చెప్పాను. అయితే మన నేటివిటీకి తగ్గట్టుగా ఇందులో కొన్ని మార్పులు చేశాం. మంచి సినిమా చేయ‌డ‌మే నా పాల‌సీ. బిజినెస్ సైడ్ చాలా మంది ఇన్‌వాల్వ్ అయివుంటారు. థియేట‌ర్లో రిలీజ్ చేయాలా, ఓటీటీలో చేయాల‌నేది మ‌న చేతుల్లో లేదు. ఈ మూవీని ఓటిటిలో రిలీజ్ చేయటం పట్ల కొంతమంది అభిమానులు బాధపడుతున్నారు. వారందరికీ నా క్షమాపణలు” అని చెప్పుకొచ్చారు.