ఈ వయసులో కూడ ఈ స్పీడ్ ఏంటి వెంకీ !

venkatesh-doing-movies-in-super-speed
venkatesh-doing-movies-in-super-speed
 
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ వేగం పెంచారు. ‘ఎఫ్ 2’ సినిమాతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కిన ఆయన అక్కడి నుండి వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు.  ఇటీవలే ‘దృశ్యం 2’ చిత్రాన్ని స్టార్ట్ చేశారు ఆయన.  మలయాళంలో మోహన్ లాల్ నటించిన ఈ చిత్రం మంచి హిట్ కావడంతో వెంకీ వెంటనే రీమేక్ మొదలుపెట్టారు.  దీనికి కూడ జీతూ జోసెఫ్ డైరెక్టర్.  చాలా తక్కువ సమయంలోనే సినిమాను కంప్లీట్ చేసేశారు. నిన్నటితో వెంకీ తాలూకు షూటింగ్ పూర్తయింది. ఒక పెద్ద హీరో సినిమా ఇంత త్వరగా పూర్తికావడం అంటే విశేషమే అనాలి.  
 
కేవలం రెండే షెడ్యూల్స్ పెట్టి సినిమాను ముగించారు. ఎక్కడా గ్యాప్ తీసుకోలేదు.  వెంకీ కూడ సినిమా కోసం వరుస డేట్స్ కేటాయించడంతో దర్శకుడి పని సులువైంది.  మొదటి పార్ట్ ‘దృశ్యం’ మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఈ సీక్వెల్ మీద అంచనాలు ఏర్పడ్డాయి.  ఈ ఏడాదిలోనే సినిమా రిలీజ్ కానుంది.  ఇక శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకీ చేసిన ‘నారప్ప’ కూడ ఈ ఏడాదికే విడుదల కానుంది. ఈ రెండు కాకుండా ‘ఎఫ్ 3’ సినిమా చేస్తున్నారు వెంకటేష్. ఇది కూడ ఇంకొన్ని రోజుల్లో పూర్తికానుంది.  ఇవే కాదు తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో వెంకటేష్ ఈ ఏడాదిలోనే కొత్త సినిమాను మొదలుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.