ఆర్యవైశ్యుల పై చంద్రబాబుది కపట ప్రేమ అంటున్న మంత్రి వెల్లంపల్లి!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పలు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే అసెంబ్లీలో కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ బాగా చర్చనీయాంశంగా మారారు. ఇదిలా ఉంటే తాజాగా అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ మంత్రి వెల్లంపల్లి చంద్రబాబు ను విమర్శిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు.

చంద్రబాబు ఆర్యవైశ్యుల పై కపట ప్రేమ చూపిస్తున్నాడని ఫైర్ అయ్యాడు. చంద్రబాబుది అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట.. లేనప్పుడు మరో మాటతో ఉంటాడని అన్నాడు. చంద్రబాబుకి పొట్టి శ్రీరాములు నిన్నే గుర్తుకు వచ్చారు అంటూ.. ఆర్యవైశ్యులను చులకనగా చూసి అవమానించింది చంద్రబాబే అని.. రోశయ్య ని ఏడిపించిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డాడు.