Veena Vani: విమాన ప్రమాదంలో వీణవాణి… గాల్లో ప్రాణాలు గాల్లోనే అంటూ.. ఏమైందంటే?

Veenavani: వీణ వాణి పరిచయం అవసరం లేని పేరు ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి భార్యగా అలాగే వీణ వాయిద్యకారిణిగా ఈమె అందరికీ సుపరిచితమే. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే వీణ వాణి తరచూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే తాజాగా ఈమె విమాన ప్రమాదం నుంచి బయటపడ్డామని చాలా సేఫ్ గా భూమి పైకి ల్యాండ్ అయ్యాము అంటూ ఒక వీడియోని షేర్ చేశారు.

ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో వీణా వాణి కూడా ఈ విధమైనటువంటి వీడియోని షేర్ చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.. ఆమె ఇటీవల ఓ విమానంలో ప్రయాణం చేస్తున్న సమయంలో ఎదురైన సంఘటనలు గురించి తెలిపారు. విమానం టేకాఫ్ అయినప్పటి నుంచి ల్యాండ్ అయ్యే వరకు విమానంలో ఏసీలు పనిచేయకపోవడంతో ఎంతో మంది ఇబ్బంది పడ్డారని తెలిపారు. ఇలా గంటలపాటు ప్రయాణం చేసే సమయంలో ఏసీలు పనిచేయకపోతే విమానంలో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి.

ఇలా ఏసీ పనిచేయకపోవడం వల్ల విమానంలో ఏదైనా సాంకేతిక లోపం ఉందా అన్న ఆందోళన అందరిలోనూ ఉందని, ఏదైనా సాంకేతిక లోపం ఉండి ప్రమాదం జరుగుతుందేమోనని కంగారు పడ్డారని తెలిపారు.. అసలు ఈ భూమి మీదకు మేము తిరిగి సేఫ్ గా లాండ్ అవుతామా లేదా అన్న భయం కూడా మొదలైందని ఈ ఆలోచనలతో గాలిలో ప్రాణాలు గాల్లోనే పోయేలాగా అనిపించాయి అంటూ ఈమె తెలిపారు .

ఆ భగవంతుడు మీదే భారం వేసుకొని అందరం ఫ్లైట్ లో కూర్చున్నాము అంటూ వీణా వాణి విమానంలో వారికి ఎదురైన చేదు సంఘటన గురించి బయట పెట్టారు. అయితే ఆ భగవంతుడి దయవల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదని చాలా సురక్షితంగా ల్యాండ్ అయ్యాము అంటూ ఈమె ఈ వీడియో షేర్ చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. అయితే ఇటీవల ఎక్కువగా విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈమె షేర్ చేసిన ఈ వీడియో పై కూడా అభిమానులు విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు.