రవితేజ కథ వరుణ్ తేజ్ కి కూడ నచ్చలేదా ?

Varun Tej puts Raviteja's story on hold
Varun Tej puts Raviteja's story on hold
ఒక హీరో కోసం రాసిన కథ ఇంకొక హీరో దగ్గరకు వెళ్లడం, చివరికి ఆ కథను వేరెవరో హీరో చేయడం ఇండస్ట్రీలో మామూలే.  ప్రస్తుతం మాస్ మహరాజ రవితేజ కోసం రెడీ అయిన కథ ఇలాగే తిరుగుతోంది.  రవితేజను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు త్రినాథరావ్ నక్కిన ఒక కథను రెడీ చేసుకున్నారు.  బెజవాడ ప్రసన్న కుమార్ ఈ కథకు రచయిత.  చిత్రానికి ‘చెట్టు కింద ప్లీడర్’ అనే టైటిల్ కూడ అనుకున్నారు.  రవితేజ కథ వినడం కూడ జరిగింది. అధికారికంగా ప్రకటించడం ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. అయితే రవితేజ ఆ సినిమాను పక్కనపెట్టి వేరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో త్రినాథరావు నక్కిన సినిమా వెనకబడిపోయింది. 
 
అలాగని రవితేజ కోసం ఎదురుచూసే పరిస్థితి కూడ లేదు.  అందుకే త్రినాథరావు, ప్రసన్న కుమార్ ఇద్దరూ కలిసి ఆ కథను తీసుకెళ్లి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు చెప్పడం జరిగిందట.  వరుణ్ తేజ్ కథ పట్ల ఆసక్తిగానే ఉన్నాడట కానీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదట.   దీంతో కొన్నిరోజులు వెయిట్ చేసిన త్రినాథరావు నక్కిన, ప్రసన్న కుమార్ ఇద్దరూ వేరొక చిన్న హీరోకు కథ చెప్పి ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ కథ రవితేజ, వరుణ్ తేజ్ లకి చెప్పిన కథేనా లేకపోతే వేరొక కథా, రవితేజ వద్దనుకున్న కథను వరుణ్ తేజ్ కూడ వద్దనుకుంటున్నాడా అనేదే ఇంకా తెలియాల్సి ఉంది.