రేసుకు సై అంటోన్న మెగా ప్రిన్స్: తానేం తక్కువ కాదంటున్నాడు

ఆల్రెడీ డిశంబర్ రిలీజ్ డేట్స్‌లో బడా మూవీ ‘పుష్ప’ తో అల్లు అర్జున్ రేసులో ఉండగా, ‘నీకన్నా నేనే ముందు బన్నీ బావ..’ అంటూ, తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా లైన్‌లోకి వచ్చేశాడు. వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘గని’. డిశంబర్‌ 3 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమాలో ప్రొఫిషనల్ బాక్సర్‌గా ప్రిన్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ లాక్ చేస్తూ, రీసెంట్‌గా ఈ సినిమా నుంచి ‘గని యాంథమ్’‌ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘దే కాల్ హిమ్ గని..’ అంటూ సాగే ఈ యాంథమ్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కండలు తిరిగిన దేహంతో, భీకరంగా కనిపిస్తున్నాడు వరుణ్ తేజ్. బాలీవుడ్ అందాల భామ సయీ మంజ్రేకర్ ఈ సినిమా కోసం మెగా ప్రిన్స్‌తో జత కడుతోంది.

‘గద్దలకొండ గణేష్’ సినిమా తర్వాత మెగా ప్రిన్స్ నుండి వస్తున్న సినిమా ఇది. కరోనా కారణంగా ఎప్పుడో రావల్సిన సినిమా ‘గని’ ఇప్పటికి రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత ‘ఎఫ్3’ సినిమా కూడా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఫిబ్రవరిలో ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసిన సంగతి తెలిసిందే.