ఇండస్ట్రీలో ఏ కథ ఏ హీరోను వరిస్తుందో చెప్పలేం. దర్శకులు ఒకరి కోసం కథ రాస్తే అది అటు తిరిగి ఇటు తిరిగి ఎవరి దగ్గరికో వెళ్లి ఆగుతుంది. అలా హిట్ సినిమాలను వదులుకున్న హీరోలు ఫ్లాప్ సినిమాల నుండి తప్పించుకున్న హీరోలు చాలామందే ఉన్నారు. ఇప్పుడు అలాంటి సంగతే ఒకటి జరిగింది. మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవల కొత్త కథను ఒప్పుకున్నారు.ఆ కథ ప్రవీణ్ సత్తారుది. అయితే ప్రవీణ్ సత్తారు మొదట ఈ కథను రామ్ కు వినిపించడం జరిగింది. రామ్ కూడ కథ నచ్చి వర్క్ చేయమన్నాడు.
అలా ఆ కథ స్రవంతి మూవీస్ బ్యానర్లో కొన్నాళ్ళు ఉంది. పలు చర్చల తర్వాత బడ్జెట్ ఎక్కువ అవుతుందనే కారణంతో రామ్ ఆ కథను పక్కనపట్టేశాడు. ఆ కథనే ప్రవీణ్ సత్తారు ఇప్పుడు వరుణ్ తేజ్ కు చెప్పడం, ఆయన ఒప్పుకోవడం జరిగిందట. అలా రామ్ కోసం తయారైన కథ చివరకు వరుణ్ తేజ్ వద్దకు వచ్చి ఆగింది.
ప్రజెంట్ వరుణ్ తేజ్ ‘ఎఫ్ 3, గని’ సినిమాలు చేస్తున్నాడు. అవి పూర్తయ్యేసరికి ర్ ఏడాది ఆఖరు అవుతుంది. ఈలోపు ప్రవీణ్ సత్తారు నాగార్జున సినిమా కంప్లీట్ చేస్తాడు. ఆతర్వాత వీరిద్దరి ప్రాజెక్ట్ మొదలవుతుంది.