క‌రోనా నుండి కోలుకున్నాక తొలి సారి షూటింగ్‌లో అడుగుపెట్టిన వ‌రుణ్ తేజ్!

క‌రోనా మ‌హ‌మ్మారి క‌ల్లోలం సృష్టిస్తుంది. ఈ వైర‌స్ వ‌ల‌న ఏ ప‌నులు కూడా స‌క్ర‌మంగా జ‌ర‌గ‌డం లేదు. సినిమా ప‌రిశ్ర‌మ‌కు ఈ క‌రోనా వైర‌స్ పెను భూతంలా మారింది. షూటింగ్ నిర్వ‌హించే సమ‌యంలో ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ ఎవ‌రో ఒక‌రు క‌రోనా బారిన ప‌డుతూనే ఉన్నారు. ఆ మ‌ధ్య ర‌జ‌నీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న అన్నాత్తే చిత్ర షూటింగ్‌లో న‌లుగురు క‌రోనా బారిన ప‌డ‌డంతో వెంట‌నే షూటింగ్ నిలిపివేశారు. ఆ మూవీ షూటింగ్ ఎప్పుడు మొద‌లు అవుతుందో కూడా ఇంత‌వ‌ర‌కు క్లారిటీ లేదు. ఇక ఇటీవ‌లి కాలంలో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి సంబంధించి త‌మ‌న్నా, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, రామ్ చ‌ర‌ణ్‌, వ‌రుణ్ తేజ్, క్రిష్ వంటి సెల‌బ్రిటీలు క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే.

రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు రీసెంట్‌గా క్రిస్మ‌స్ వేడుక త‌మ ఇంట్లో నిర్వ‌హించ‌గా, ఈ పార్టీకి మెగా ఫ్యామిలీ అంతా హాజ‌రైంది. అంద‌రు తెగ సంద‌డి చేశారు. ఈ పార్టీ అయిన నాలుగు రోజుల‌కు రామ్ చ‌ర‌ణ్ తేజ్, వ‌రుణ్ తేజ్‌ల‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. దీంతో వెంట‌నే క్వారంటైన్‌కు వెళ్ళారు. అదృష్ట‌వ‌శాత్తు మిగ‌తా వారెవ‌రికి క‌రోనా సోక‌లేదు. అయితే వ‌రుణ్ తేజ్ క‌రోనా బారిన ప‌డ‌డంతో ఆయ‌న చేస్తున్న సినిమాల‌కు కాస్త బ్రేక్ ప‌డింది.ఇక ఇటీవ‌ల త‌న‌కు నెగెటివ్ రిపోర్ట్ రావ‌డంతో క్వారంటైన్ ముగించుకుని బయట అడుగు పెట్టాడు. తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈయన నటిస్తున్న ఎఫ్ 3 షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టాడు

వెల్ కమ్ టూ వరుణ్ తేజ్ బ్రదర్.. ఫన్ మళ్లీ మొదలైంది అంటూ అనిల్ రావిపూడి ఆయనకు ట్వీట్ చేసాడు. దీనికి వరుణ్ తేజ్ కూడా స్పందించాడు. అయితే వ‌రుణ్ క్వారంటైన్‌లో ఉన్న స‌మ‌యంలో అనీల్ రావిపూడి వెంకీతో స‌న్నివేశాలు చిత్రీక‌రించినట్టు తెలుస్తుంది. ఎఫ్ 2 సినిమా బడ్జెట్ 30 కోట్ల లోపే పూర్తైపోతే.. ఇప్పుడు ఎఫ్ 3 కోసం మాత్రం దాదాపు 80 కోట్లు ఖర్చు చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు. ఇందులో త‌మ‌న్నా, మెహ్రీన్‌లు క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. మ‌రో హీరో కూడా ఇందులో న‌టిస్తారు అని వ‌స్తున్న వార్త‌ల‌పై క్లారిటీ లేదు.