ఇండియన్ ఐడల్ విజేతగా వాగ్దేవి… చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీ!

మొట్టమొదటిసారి తెలుగు ఓటీటీ ఆహా వేదికగా ఇండియన్ ఐడల్ సింగిల్ కాంపిటీషన్ ప్రారంభమైన విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది సింగర్స్ వారిలో ఉన్న నైపుణ్యాన్ని బయటపెట్టారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. జూన్ 17వ తేదీ ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.12 మంది కంటెస్టెంట్ లో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ టాప్-5 కంటెస్టెంట్ గా ఐదుగురు నిలిచారు. ఈ క్రమంలోనే ఈ ఐదుగురిలో విజేత ఎవరు అంటూ పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి విజేతగా సింగర్ వాగ్దేవి నిలిచినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ పూర్తికావడంతో విజేతగా వాగ్దేవి నిలిచినట్టు తెలుస్తుంది.ఇకపోతే ఈ కార్యక్రమ గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కాగా విరాటపర్వం చిత్రబృందం కూడా సందడి చేసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా వాగ్దేవి విజేతగా నిలబడి మెగాస్టార్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నారని సమాచారం.

ఇక ఈ కార్యక్రమానికి సింగర్ శ్రీరామచంద్ర వ్యాఖ్యాతగా వ్యవహరించగా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్, హీరోయిన్ నిత్య మీనన్, సింగర్ కార్తీక్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే విజేతగా నిలిచిన వాగ్దేవి ఎప్పటికైనా పెద్ద సింగర్ గా తనను చూడాలన్నదే తన తల్లి కోరిక అని ఈ విజయాన్ని తన తల్లికి అంకితం చేస్తున్నానని తెలిపారు. తనకు ఏ ఆర్ రెహమాన్, ఇళయరాజా గారి వంటి దగ్గర సింగర్ గా పాడాలనే కోరిక ఉందని వాగ్దేవి తన కోరికను బయటపెట్టారు.