Uppena: బుల్లితెర మీద కూడ ‘ఉప్పెన’ సృష్టించింది

Uppena scores 18 TRP through TV premiers

Uppena: ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీ చూసిన మంచి విజయాల్లో ‘ఉప్పెన’ ఒకటి. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని మూటగట్టుకుంది. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని బుచ్చిబాబు సాన డైరెక్ట్ చేశాడు.

Uppena scores 18 TRP through TV premiers
Uppena scores 18 TRP through TV premiers

సినిమాను కొన్ని డిస్ట్రిబ్యూటర్లు భారీ లాభాలని అందుకున్నారు. వెండితెర మీదనే కాదు బుల్లితెర మీద కూడ ఈ చిత్రం ఉప్పెనంత విజయాన్ని సొంతం చేసుకుంది. స్టార్ మాలో తొలిసారి ప్రసారమైన ఈ చిత్రం ఏకంగా 18 టీఆర్ఫీని అందుకోవడం విశేషం. ఈ స్థాయి రేటింగ్స్ సాధించడం పెద్ద పెద్ద సినిమాలకు కూడ సాధ్యం కాలేదు.

మంచి పాటలు, చూడముచ్చటైన జంట, మంచి కథ సినిమాకు ఇంత పెద్ద విజయాన్ని అందించాయి. అటు థియేటర్ ప్రేక్షకుల్ని ఇటు టీవీ ప్రేక్షకుల్ని సమన రీతిలో ఆకట్టుకోవడంతో చిత్రం క్లీన్ హిట్ అనే పేరు తెచ్చుకుంది.