షాకింగ్ : హాట్ టాపిక్ గా ‘ఉప్పెన’ హీరోయిన్ లిప్ లాక్.!

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ చేసిన మొదటి సినిమా “ఉప్పెన” ఈ ఏడాది ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. అయితే ఈ సినిమా ఇంత హిట్ అవ్వడానికి అంత పెద్ద బజ్ తెచ్చుకోవడానికి గల ప్రధాన కారణాల్లో యంగ్ హీరోయిన్ కృతి శెట్టి కూడా ఒకటి. తన మొదటి సినిమానే అయినా రిలీజ్ కి ముందే టాలీవుడ్ లో సెన్సేషన్ అయ్యిపోయింది. ఇక ఆ సినిమా తర్వాత భారీ సినిమాలు పెద్ద పెద్ద స్టార్స్ తో సినిమాలు చేసే అవకాశాన్ని కూడా దక్కించుకుంది.

అయితే ఈ సినిమా తర్వాతే రెండో సినిమా లేటెస్ట్ ది నాని తో చేసిన శ్యామ్ సింగ రాయ్ లో లిప్ లాక్ చేసి షాక్ ఇచ్చింది. అంత తక్కువ ఏజ్ అలాగే జస్ట్ ఒక్క సినిమా గ్యాప్ లోనే ఈ హీరోయిన్ ఇలా చెయ్యడమే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలిచింది. దీనిని బట్టి ఈ యంగ్ హీరోయిన్ రోల్ డిమాండ్ కి ఇలాంటి వాటికి కూడా నో చెప్పదని ఆడియెన్స్ కి శ్యామ్ సింగ రాయ్ తో ఓ క్లారిటీ వచ్చింది.