మహేష్ సినిమాకి తగ్గేదేలే అంటున్న థమన్.!

టాలీవుడ్ లో ఇప్పుడు టాప్ ఫామ్ లో ఉన్న సంగీత దర్శకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది టెడ్డీ బాయ్ థమన్ అనే చెప్పాలి. వరుస హిట్ ఆల్బమ్స్ తో అదిరే లెవెల్లో సినిమాలకు కంపోజ్ చేస్తూ బిజీగా మారిపోయాడు. ఇక ఇప్పుడు మరిన్ని భారీ సినిమాలు చేస్తున్న థమన్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో “సర్కారు వారి పాట” సినిమా కూడా చేస్తున్నాడు. మరి గతంలో “దూకుడు”, “ఆగడు”, “బిజినెస్ మెన్” లాంటి సాలిడ్ ఆల్బమ్స్ ఇచ్చిన థమన్ నుంచి ఈసారి కూడా అంతే స్థాయి పాటలు ఎదురు చూస్తున్నారు.

మరి ఆ అంచనాలకు తగ్గట్టే థమన్ కూడా ఎక్కడా తగ్గేదేలే అంటున్నాడు. తన హార్ట్ కి ఈ ఆల్బమ్ చాలా క్లోజ్ గా ఉండేది అని అందుకే ఎక్కడా తగ్గకుండా ఈ సినిమా ఆల్బమ్ చేస్తున్నానని థమన్ అంటున్నాడు. అలాగే ఈ ఆల్బమ్ చాలా స్పెషల్ గా ఉంటుంది అని తెలియజేసాడు. అలాగే సినిమా రిలీజ్ తగ్గట్టే అప్డేట్ లు కూడా ఉంటాయని ఇంకో క్లారిటీ కూడా ఇచ్చాడు. ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నాడు.