మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన చాలా పద్దతి గల అమ్మాయి అని చాలా మంది చెప్పేమాట. ఇంటి బాగోగులతో పాటు బిజినెస్ పనులని చక్కదిద్దుకుంటూ అందరితో శభాష్ అనిపించుకుంటూ ఉంటుంది. ఆమె స్నేహితులు కూడా ఉపాసన కంపెనీని ఎల్లప్పుడు కోరుకుంటూ ఉంటారు. రీసెంట్‌గా సమంతతో కొత్త ప్రోగ్రాం ఒకటి స్టార్ట్ చేసి ఆరోగ్యం గురించి ప్రజలకు తెలియజేసే బాధ్యతను అందిపుచ్చుకుంది. మరోవైపు అపోలో ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తుంటుంది.
అపోలో అధిపతి వారసురాలు అయినా.. మెగాస్టార్ చిరంజీవి కోడలు అయినా.. అగ్రకథానాయకుడు రామ్ చరణ్ భార్య అయినప్పటికీ ఉపాసన చాలా హుందాగా ఉంటుంది. అందరితో సరదాగా కలిసిపోతూ నలుగురికి నాలుగు మంచి మాటలు చెప్పి సమాజానికి తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఉపాసన షాకింగ్ విషయాలు చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. తన బెస్ట్ ఫ్రెండ్ ఒకరు హిజ్రా (ట్రాన్స్ జెండర్) అన్న విషయాన్ని నిర్మాహమాటంగా చెప్పుకొచ్చింది.
మహిళల ప్రాముఖ్యత, వారిగొప్పదనాన్ని తెలియజేస్తూ ప్రతి ఇంట్లో మహిళలు గౌరవించబడాలి. మహిళలను గౌరవించని ఇంట్లో దేవి మాతకు ప్రార్ధనలు కూడా చేయోద్దు. అసలు పూజ గది నుండే దేవి ఫోటోలను తీసేయాలి. మహిళలను గౌరవించని వారు దేవీ మాతల ఫోటోలు పెట్టుకోకూడదని ప్రార్థనలు చేయొద్దనేది నా అభిప్రాయం అని ఉపాసన పేర్కొన్నారు. ఆమె మాటలను చాలా మంది స్వాగతిస్తున్నారు
ఇక ఉపాసన భర్త రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే చిత్రంతో బిజీగా ఉండగా ఈ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ కు సంబంధించి వీడియో విడుదల కాగా, ఇది సినీ లవర్స్‌ని ఎంతగానో అలరించింది. రెండు రోజుల క్రితం విడుదలైన ఎన్టీఆర్ వీడియోలో చరణ్ నాలుగు భాషలలో వాయిస్ ఓవర్ అందించగా అతని ప్రయత్నాన్ని అందరు మెచ్చుకుంటున్నారు.