Upasana: ఇన్ని సంవత్సరాల ప్రేమ అంటూ ఎమోషనల్ వీడియో షేర్ చేసిన మెగా కోడలు… వీడియో వైరల్!

Upasana: మెగా ఇంటికోడలుగా ఉపాసన అడుగు పెట్టిన విషయం మనకు తెలిసిందే. ఈమె రామ్ చరణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాదాపు వీరి వివాహం జరిగి 13 సంవత్సరాలు అవతుంది అయితే వీరి పెళ్ళైన 11 సంవత్సరాలకు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం వీరికి క్లీన్ కారా జన్మించిన సంగతి తెలిసిందే. ఇక రాంచరణ్ ఇండస్ట్రీలో గ్లోబల్ స్టార్ గా మంచి గుర్తింపు సంపాదించుకోగా ఉపాసన కూడా అదే స్థాయిలో గుర్తింపు పొందారు.

ఉపాసన బిజినెస్ ఉమెన్ గా అపోలో హాస్పిటల్ చైర్పర్సన్ గా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఉపాసన వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా గడుపుతూనే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తూ తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఉపాసన తాజాగా సోషల్ మీడియా వేదికగా తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఉన్నటువంటి ఒక వీడియోని షేర్ చేశారు..

తన అమ్మానాన్న 40 సంవత్సరాల పెళ్లిరోజు కావడంతో తన కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే చోట చేరి తన తల్లిదండ్రుల పెళ్లి రోజు వేడుకను ఘనంగా జరిపినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియోని ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇక ఈ వీడియోలో రామ్ చరణ్ క్లిన్ కారా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారని చెప్పాలి.తాజాగా ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ చేస్తూ…. అందులో 40 సంవత్సరాల ప్రేమ & కలయికను జరుపుకుంటున్నాము.. వార్షికోత్సవ శుభాకాంక్షలు, లవ్ యు, అమ్మ & నాన్న.. మేము నిజంగా ఆశీర్వదించబడ్డాము అంటూ రాసుకొస్తూ తన అమ్మా నాన్నకి వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఫోటోలు వైరల్ అవుతున్నాయి.