తాజాగా కేంద్ర వైద్యరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి భారతి ప్రవీణ్ తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై ప్రశంసలు కురిపించారు. అక్కడ కోవిడ్ టీకాలు అందించడంలో ప్రభుత్వం పనితీరు అద్భుతంగా ఉంది అని అభినందించారు. అక్కడ వ్యాక్సినేషన్ చాలా త్వరగా సాగిందని.. చాలావరకు 99% రెండు డోస్ టీకాలు అందించింది అని అన్నారు.
ఫెడరల్ స్ఫూర్తితో రాష్ట్రాలతో కలిసి పని చేస్తున్నాము అని.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరిక మేరకు మూడు మెడికల్ కళాశాలలు మంజూరు చేశాము అని అన్నారు. మిగిలిన వాటిని కూడా దశలవారీగా మంజూరు చేస్తామని ప్రకటించారు. మొత్తానికి అక్కడి పనితనం బాగుంది అని ఆ ప్రభుత్వం కు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి భారతీ ప్రవీణ్.