Khiladi : “ఖిలాడి” పై ట్విట్టర్ రివ్యూ..సినిమా ఎలా ఉంది? ఏ అంశాలు హైలైట్స్ అంటే?

Khiladi : ఈ ఏడాది లో ఈ రెండు నెలల్లో చెప్పుకోదగ్గ పెద్ద రిలీజ్ ఏదన్నా ఉంది అంటే అది మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం “ఖిలాడి” అని చెప్పాలి. ఇద్దరు హీరోయిన్స్ డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి లు హీరోయిన్స్ గా రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఎట్టకేలకు ఈరోజు తెలుగు మరియు హిందీ భాషల్లో రిలీజ్ అయ్యింది.
అయితే ట్రైలర్ తో మంచి ఆసక్తి రేపిన ఈ చిత్రం ఆల్రెడీ కొన్ని ఓవర్సీస్ షోలు ఎర్లీ మార్నింగ్ షోలు పలు చోట్ల పడిపోయాయి. మరి ఆ షోలు చూసిన వారు తమ వ్యూ పంచుకోకుండా తమ వ్యూస్ ఉంటారా? అలా ట్విట్టర్ లో ఈ చిత్రం కోసం ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తుంది. అయితే ఓవరాల్ గా పరిశీలనలో అయితే ఈ చిత్రానికి మిక్సిడ్ టాక్ నే అధికంగా వినిపిస్తుంది.
అలాగే ఏ అంశాలు హైలైట్ గా నిలిచాయి అనేది కూడా తెలుస్తుంది. ఈ చిత్రంలో రవితేజ పెర్ఫామెన్స్ అవుట్ స్టాండింగ్ కాగా ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ మరియు సినిమాలో ట్విస్టులు బాగున్నాయని ట్విట్టర్ ప్రజానీకం అంటున్నారు. అలాగే సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ లు క్లైమాక్స్ సినిమాలో సూపర్ గా ఉన్నాయని అంటున్నారు. ఇవే ఈ సినిమాలో మెయిన్ హైలైట్స్ గా నిలిచాయట. ఇదే ఈ సినిమాపై లేటెస్ట్ టాక్.