ట్విట్టర్ రివ్యూ : మహేష్ “సర్కారు వారి పాట” కి ఏదో తేడాగా ఉందే..!

Sarkaru Vaari Paata : ఎన్నో అంచనాలు నడుమ ఈ ఏడాది టాలీవుడ్ దగ్గర రిలీజ్ అయ్యిన లేటెస్ట్ సినిమా “సర్కారు వారి పాట”. సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి దాదాపు రెండేళ్ల తర్వాత మళ్ళీ మూడు భారీ హిట్స్ తర్వాత చేసిన సినిమా ఇది. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే ఒక స్పెషల్ ప్రాజెక్ట్ గా తెరకెక్కి ఎట్టకేలకు నిన్న ప్రీమియర్స్ తో రిలీజ్ కి వచ్చింది.

అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఉదయం 4 గంటల షో నుంచి స్టార్ట్ అయ్యాయి. సరే ఇది అంతా బాగానే ఉంది కానీ మరి ఈ సినిమాకి కాస్త తేడాగానే ఆడియెన్స్ తమ రెస్పాన్స్ ని ఇస్తున్నారని చెప్పాలి. సినిమా చూసిన వారు ట్విట్టర్ వేదికగా కాస్త మిక్సిడ్ రివ్యూస్ చెబుతున్నారు.

సినిమాలో ఫస్ట్ హాఫ్ బాగుందని కాకపోతే రెండో సగం కాస్త లాగ్ ఉందని అయినా పర్వాలేదని కొంతమంది అంటున్నారు. అలాగే మహేష్ బాగున్నాడు కీర్తి తో కూడా కాస్త కొత్తగా ట్రై చేశారు కానీ అది మాత్రం అంతగా వర్కౌట్ కాలేదని కొందరు ప్రముఖులు అంటున్నారు. అలాగే మరీ అంత హిట్ రేంజ్ సినిమా అయితే కాదని పర్వాలేదని వీక్షకులు చెబుతున్నారు.

ఇంకా షాకింగ్ గా థమన్ బాక్గ్రౌండ్ స్కోర్ అంతగా వర్కౌట్ అవ్వలేదట. అయితే మహేష్ ఫ్యాన్స్ అయితే దాదాపు పాజిటివ్ గానే చెప్పుకుంటున్నారు. కానీ ఓవరాల్ గా ఆడియెన్స్ టాక్ మాత్రం కాస్త డిఫరెంట్ గానే ఉంది. మరి దీన్ని దాటి హిట్ అయ్యిన సినిమాలు కూడా మహేష్ వి లేకపోలేవు అలా ఏమన్నా మ్యాజిక్ ఈ సినిమాకి జరుగుతుందేమో చూడాలి.