ట్విట్టర్ రివ్యూ : సమంత “యశోద” కి రెస్పాన్స్ ఎలా ఉందంటే.!

హీరోయిన్ సమంత నుంచి హీరోయిన్ గా కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఉండగా ఈ చిత్రాల్లో లేటెస్ట్ గా రిలీజ్ కి వచ్చిన అవైటెడ్ చిత్రం “యశోద” కూడా ఒకటి. మరి ఈ చిత్రాన్ని హరి మరియు హరీష్ లు దర్శకత్వం వహించగా ఈరోజు అయితే ఈ చిత్రం అయితే థియేటర్స్ లో ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది.

అయితే ఈ చిత్రం యూఎస్ లో రీసెంట్ గా ఏ సినిమాకి కూడా రెస్పాన్స్ రాని విధంగా వసూళ్లు కూడా నమోదు చేసి ట్రేడ్ వర్గాలని ఆశ్చర్య పరచగా ఈ చిత్రం కి యూఎస్ ఆడియెన్స్ ని అలాగే ఆల్రెడీ ప్రీమియర్స్ ని చూసిన వారు అయితే తమ రెస్పాన్స్ అందిస్తున్నారు.

మరి ఈ చిత్రం పై చాలా సాలిడ్ పాజిటివ్ రెస్పాన్స్ వినిపిస్తుంది. సమంత టెర్రిఫిక్ నటన అలాగే సోషల్ సబ్జెక్టు కూడా అదిరే లెవెల్లో ఆకట్టుకుంటుంది అని అంటున్నారు. అలాగే ఈ సినిమాలో ఎమోషన్స్ కూడా సాలిడ్ గా ఆకట్టుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

అయితే మరికొందరు కాస్త నెగిటివ్ గానే స్పందిస్తున్నా సినిమాలో మాత్రం మంచి మేటర్ ఉందని కొందరు అంటున్నారు. సరోగసి పై చూపిన కొన్ని నిజాలు ఆసక్తిగా ఉన్నాయని డెఫినెట్ గా ఇవి ఆకట్టుకుంటాయని అని అంటున్నారు. మరి సామ్ అయితే ఫైనల్ గా సినిమాలో సోలో సక్సెస్ అందుకున్నట్టే అని చెప్పొచ్చో లేదో అసలు రివ్యూ వచ్చే వరకు ఆగితే సరిపోతుంది. ఆల్ మోస్ట్ అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సూపర్ పాజిటివ్ వార్తలే వినిపిస్తున్నాయి.