ట్విస్ట్ : “విరాటపర్వం” లో హీరో రాణానే కానీ..హీరోయిన్ దే పై చేయి?

Virata Parvam should release in theatres only
చాలా కాలం తర్వాత థియేటర్స్ లో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “విరాటపర్వం”. టాలీవుడ్ స్టార్ అండ్ టాలెంటెడ్ హీరో రాణా దగ్గుపాటి హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా దాదాపు రెండున్నర ఏళ్ళు లేట్ తర్వాత రిలీజ్ కి వస్తుంది.
అయితే ఈ సినిమాని దర్శకత్వం వహించిన దర్శకుడు వేణు ఉడుగుల తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాపై పలు ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ బయట పెట్టాడు. అయితే ఇది నక్సల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఒక పీరియాడిక్ సినిమానే అయినా మంచి ప్రేమ కథ కూడా ఈ సినిమాలో కనిపిస్తుంది అని తెలిపాడు.
అయితే ఈ సినిమాలో హీరో రాణా కావచ్చు కానీ కథ మాత్రం హీరోయిన్ సాయి పల్లవి ని దృష్టిలో పెట్టుకొని రాసుకున్నానని అసలు ట్విస్ట్ ఇప్పుడు బయట పెట్టాడు. అలాగని ఈ సినిమాలో రాణా రోల్ కూడా తక్కువేమి ఉండదు అని తెలిపాడు. అయితే ఇది దగ్గుబాటి అభిమానులకి కాస్త డిజప్పాయింటింగ్ న్యూస్ అని చెప్పాలి.
ఇప్పటి వరకు రాణా సినిమాలో సాయి పల్లవి ఉంది అనుకున్నారు కానీ రానా ఉన్నాడని చెప్పడం ఒకింత బాధాకరమే అని చెప్పాలి. అయితే ట్రైలర్ చూసినప్పుడే అందరికీ కాస్త అనుమానం వచ్చి ఉండొచ్చు కానీ ఇప్పుడు దర్శకుడు చెప్పిన మాటలతో అయితే టోటల్ క్లారిటీ వచ్చేసింది అని చెప్పాలి. మరి ఈ సినిమాలో ప్రియమణి తదితరులు కీలక పాత్రలు చేయగా జూన్ 17న ఈ సినిమా రిలీజ్ అవుతుంది.