Bandi Sanjay : బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు.. ఆగ్రహం లో బీజేపీ శ్రేణులు!

Bandi Sanjay : తాజాగా భాజపా తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే.
ప్రజా సంగ్రామ పాదయాత్ర అనే పేరుతో ఈయన ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు ఈయన పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల వద్ద టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వెంటనే అక్కడున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇక తమ పాదయాత్రను అడ్డుకున్నందుకు బీజేపీ శ్రేణులు వారిపై మండిపడుతున్నారు. ఇక పోలీసులు ఈ గొడవను సద్దుమణిగే ప్రయత్నం చేశారు. ఇదంతా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిసింది.