తమిళ హీరోతో త్రివిక్రమ్..క్రేజీ కాంబో

Trivikram wrote story for Suriya
Trivikram wrote story for Suriya
తమిళ హీరోలు తెలుగు దర్శకులతో వర్క్ చేయాలని చాలా కాలం నుండి ఆశపడుతున్నారు.  అలా ఆశపడుతున్న హీరోల్లో సూర్య కూడ ఉన్నారు. సూర్యకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఆయన నేరుగా ఒక తెలుగు సినిమా చేస్తే చూడాలని తెలుగు ఆడియన్స్ కూడ ఆశపడుతున్నారు.  సూర్య అయితే గతంలో చాలసార్లు తెలుగు డైరెక్టర్ల కోసం గట్టిగా ట్రై చేశాడు. ముఖ్యంగా త్రివిక్రమ్ కోసం. త్రివిక్రమ్ సైతం సూర్యతో వర్క్ చేయడానికి ఆసక్తి చూపించారు. కానీ త్రివిక్రమ్ చాలా బిజీగా ఉండటంతో అది కుదరలేదు.  అయితే ఇప్పుడు మాత్రం ఈ కాంబినేషన్ వర్కవుట్ అయ్యేలా ఉంది. 
 
త్రివిక్రమ్ ఇటీవల సూర్య కోసం ఒక కథ రాసుకోవడం జరిగిందట.  ప్రస్తుతం మహేష్ బాబుతో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు త్రివిక్రమ్. మరోవైపు సూర్య కూడ మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు.  దాదాపు ఇద్దరూ ఒకే సమయానికి ఫ్రీ అవుతారు.  కాబట్టి అప్పుడు కలిసి సినిమా చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.  ఇదే గనుక జరిగితే ఒక క్రేజీ కాంబినేషన్ సెట్ అయినట్టే.  మరోవైపు బోయపాటి శ్రీను సైతం సూర్య కోసం ట్రై చేస్తున్నారట.  కథను రాసుకుని సిద్దంగా ఉన్నారట.  సూర్య కూడ ఇంకోసారి ‘సింగం’ లాంటి పవర్ఫుల్ సినిమా మరోసారి చేస్తే బాగుంటుందని ఆశపడుతున్నారు.  మరి త్రివిక్రమ్, బోయపాటిలో సూర్య ఎవరితో ముందుగా వర్క్ చేస్తారో చూడాలి.