‘టక్ జగదీష్’ ఎఫెక్ట్ నాని మీద గట్టిగానే పడిందటగా.!

 

కరోనా నేపథ్యంలో ధియేటర్ల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నాని తన సినిమా ‘టక్ జగదీష్‌ని ఓటీటీలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మంచి నిర్ణయమే తీసుకున్నాడు.. లేదు బిగ్ మిస్ట్లేక్ చేశాడు.. అంటూ ఈ విషయంలో నానిపై భిన్న వాదనలు వినిపించాయి.

ప్రస్తుతం నాని నుండి రెండు సినిమాలు రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. ‘అంటే సుందరానికి’ ఒకటి, ‘శ్యామ్ సింగరాయ్’ మరొకటి. ఈ రెండు సినిమాలపైనా అంచనాలు బాగానే ఉన్నప్పటికీ, ‘టక్ జగదీష్’ ఎఫెక్ట్ ఈ రెండు సినిమాల సక్సెస్‌ని ప్రభావితం చేసేలా కనిపిస్తోందంటున్నారు.

ఈ మధ్య ధియేటర్లలో సినిమాలు బాగానే రిలీజ్ అవుతున్నాయి. కానీ, నాని సినిమాలు మాత్రం ఓటీటీకే అడుగుతున్నారట. దాంతో ఈ సినిమా నిర్మాతలు డైలమాలో పడ్డారట. ఈ మధ్య పవన్ కళ్యాణ్ – సినిమా టికెట్ల వివాదంలో స్వయంగా నాని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం, అలాగే పవన్ కళ్యాణ్‌కి తన మద్దతు తెలపడం వంటి ఇష్యూస్ నానిపై నెగిటివ్ ఇంపాక్ట్‌కి దారి తీసేలా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.
చూడాలి మరి, ఈ ఎఫెక్ట్ నుండి నేచురల్ స్టార్ నాని ఎలా బయటపడగలడో.