ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా పుష్ప పార్ట్ 1 కోసం అందరికీ తెలిసిందే. బన్నీ కెరీర్ లోనే సినిమాని చాలా ప్రిస్టేజియస్ గా తీసుకున్నాడు. అందుకే తన వల్ల అయ్యింది అంతా కూడా పెట్టేసాడు. కానీ ఊహించని విధంగా లాస్ట్ మినిట్ లో ఈ సినిమా పాన్ ఇండియన్ రిలీజ్ కాదు అని టాక్ రావడంతో ఒక్కసారిగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ డీలా పడిపోయారు.
ఇంకా అల్లు అర్జున్ ముందే పెద్ద ప్రశ్నలా వచ్చింది. తన బాలీవుడ్ ఎంట్రీ ఈ సినిమాతోనే చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఫైనల్ గా ఈ చిత్రం హిందీ రిలీజ్ కి మొత్తం లైన్ క్లియర్ అయ్యినట్టు తెలుస్తుంది. అన్ని సమస్యలు కూడా క్లియర్ అయ్యాయని మళ్ళీ పుష్ప హిందీ రిలీజ్ కన్ఫర్మ్ అని సమాచారం. కానీ ఇంకా ఏ బ్యానర్ లో ఉంటుంది పాతదా కొత్త ప్లాన్స్ ఏమన్నా చేసారా అన్నది తెలియాల్సి ఉంది.