Mahesh Babu: మహేష్ బాబు కోసం క్యూలో నిలుచున్న డైరెక్టర్లు.. ఎవరెవరంటే?

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పటి వరకు 70 శాతం షూటింగ్ పూర్తి కాగా, కేవలం 30 శాతం షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఇక ఈ షూటింగ్ లో భాగంగానే మహేష్ కాలికి దెబ్బ తగలడంతో అతనికి కాలి కీ సర్జరీ జరిగింది. ఇక మహేష్ బాబు కు కరోనా మహమ్మారి కూడా సోకడంతో షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మిగిలిపోయిన సన్నివేశాలను పిబ్రవరిలో మొదలుపెట్టి ఈసినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి అని చూస్తున్నారు.

ఇకపోతే సర్కారు వారి పాట సినిమా తరువాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం అయిపోయింది. ఇక ఏప్రిల్ లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ని మొదలుపెట్టాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు త్రివిక్రమ్. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాను పూర్తి చేసుకొని ఆ తర్వాత రాజమౌళి తో సినిమాలు చేయాలి అని చూస్తున్నాడు మహేష్ బాబు. ఇకపోతే మహేష్ బాబు సినిమా డేట్స్ కోసం ప్రస్తుతం టాలీవుడ్ లోని స్టార్ డైరెక్టర్లు పడిగాపులు కాస్తున్నారు.

మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అరడజను మందికీ పైగా దర్శకులు మహేష్ తో సినిమా చేయాలని ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు మాత్రం సినిమాల ఎంపిక విషయంలో ఏమాత్రం తొందరపడకుండా ఆచితూచి వ్యవహరిస్తూ అడుగులు వేస్తున్నాడు. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయ్యి 3 ఏళ్లు అవుతున్నా కూడా ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. మహేష్ బాబు ఏడాదికి ఒక సినిమా తీస్తాడు. రాజమౌళితో సినిమా అంటే ఎంత లేదన్నా 2,3 ఏళ్లు సమయం పడుతుంది. మరి మహేష్ బాబు ఆ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అన్నది చర్చనీయాంశంగా మారింది. కేవలం వీరు మాత్రమే కాకుండా మహేష్ బాబు తో సినిమాలను చేయడానికి దర్శకుడు అనిల్ రావిపూడి, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, అలాగే దర్శకుడు వంశీ పైడిపల్లి, దర్శకుడు కొరటాల శివ, సుకుమార్ ఇలాంటి దర్శకులు మహేష్ బాబు తో సినిమా చేయడం కోసం, మహేష్ బాబు డేట్స్ కోసం పడిగాపులు కాస్తున్నారు.