ప్రతి స్టార్ హీరోకు 100వ సినిమా ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. 100వ సినిమా కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకునేలా స్టార్ హీరోలు జాగ్రత్తలు తీసుకుంటారు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, బాలకృష్ణ, మరికొందరు హీరోలు 100 కంటే ఎక్కువ సినిమాలలో నటించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు. సీనియర్ ఎన్టీఆర్ 100వ సినిమా గుండమ్మ కథ కాగా ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.
అక్కినేని నాగేశ్వరరావు 100వ సినిమా గుండమ్మ కథ తమిళ్ రీమేక్ కాగా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి కనీవిని ఎరుగని స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది. సూపర్ స్టార్ కృష్ణ 100వ సినిమా అల్లూరి సీతారామరాజు కాగా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. కృష్ణంరాజు 100వ సినిమా రంగూన్ రౌడీ కాగా ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.
శోభన్ బాబు 100వ సినిమా నిండు మనిషి కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. మురళీ మోహన్ 100వ మూవీ వారాలబ్బాయి కాగా కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. చిరంజీవి 100వ సినిమా త్రినేత్రుడు కాగా ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. బాలయ్య 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ను సొంతం చేసుకుంది.
మోహన్ బాబు 100వ సినిమా మరో మాయాబజార్ కాగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. రాజేంద్ర ప్రసాద్ 100వ సినిమా చెట్టు కింద ప్లీడర్ కాగా ఈ సినిమా కమర్షియల్ హిట్ గా నిలిచింది. శ్రీకాంత్ 100వ సినిమా మహాత్మ కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ ను అందుకుంది. 100వ సినిమాతో ఎక్కువమంది హీరోలు సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.