టాలీవుడ్ : మొత్తానికి నాగ చైతన్య గట్టెక్కబోతున్నాడా..?

Naga Chaitanya Thank You Movie

మన దేశంలో ఏ ఇండస్ట్రీలో కూడా ఆడియెన్స్ ఆదరాయించని విధంగా మన తెలుగు ఆడియెన్స్ సినిమాలను ఆదరిస్తారు. మరి అది ఏ భాష నుంచి వచ్చినా కూడా మన వాళ్లలో ఆ సినిమా క్లిక్ అయ్యింది అంటే ఒరిజినల్ కన్నా మన దగ్గరే ఎక్కువ హిట్టవుతుంది. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో షాకింగ్ వాతావరణమే నెలకొంది.

ఆడియెన్స్ థియేటర్స్ కి రావడానికి బాగా మొహం చాటేస్తున్నారు. సరైన కంటెంట్ పడకో లేక టికెట్ ధరల వల్లో కానీ ఆడియెన్స్ రాక వసూళ్లు మంచి అంచనాలు పెట్టుకొని వస్తున్న సినిమాలకు రావడం లేదు. దీనితో నిర్మాతలు కూడా అప్రమత్తం అవుతున్నారు. అయితే ఈ లిస్ట్ లో రీసెంట్ గా వచ్చిన “వారియర్” చేరగా..

నెక్స్ట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన “థాంక్ యూ” కూడా చేరుతుందేమో అని ఎక్కడో అనిపించింది. కానీ అనూహ్యంగా ఈ సినిమాకి ఆడియెన్స్ ఆసక్తి కనబరుస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో మన తెలుగు నుంచి ఏ సినిమాకి చెయ్యని విధంగా ముందు రోజు రాత్రే ప్రీమియర్ షో లు ఈ సినిమాకి ఏపీలో ప్లాన్ చేశారు.

దీనితో ఈ షోస్ బుకింగ్స్ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కనబడింది. దీనితో ఈ సినిమా విషయంలో మాత్రం ఆడియెన్స్ బాగానే ఉన్నారని అనిపిస్తుంది. ఇక ఇదే ఊపులో సినిమాకి కూడా మంచి టాక్ వస్తే నాగ చైతన్య ఈ జూలై రిలీజ్ ల ప్లాప్స్ నుంచి గట్టెక్కేసినట్టే అని చెప్పి తీరాలి. ఇక ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించగా విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించాడు. అలాగే దిల్ రాజు నిర్మాణం వహించాడు.