Sreeleela: బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్న హీరోయిన్ శ్రీలీల.. హీరో ఎవరో తెలుసా?

Sreeleela: టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే వరుసగా సినిమాలను నటించి మెప్పించింది. ఇక శ్రీలీల చివరగా పుష్ప 2 సినిమాలో కిస్సిక్ అనే సాంగ్ తో మెరిసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా శ్రీలీల బాగానే కలిసి వచ్చింది. ఈ పాట ఎంత వైరల్ అయిందో శ్రీలీల పేరు కూడా అంతగా మారుమోగిన విషయం తెలిసిందే.

దీంతో ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం వరుసగా అవకాశాలు క్యూ ఉన్నాయి. దక్షిణాదిలో ఒక ఊపు ఊపేస్తోన్న శ్రీలీలకు ఇప్పుడు బాలీవుడ్‌ లోనూ క్రేజీ ఛాన్ కొట్టేసింది. శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ వచ్చేసింది. గత కొద్ది రోజులుగా అభిమానులు ఎప్పుడెఎప్పుడా అని ఎదురు చూస్తున్నా అప్డేట్ రానే వచ్చేసింది. శ్రీ లీలా బాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్ అని తెలుస్తోంది. హీరో మరెవరో కాదండోయ్ బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్. ఈ హీరో సరసన నటించి మెప్పించనున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ వీడియోని మూవీ మేకర్స్ విడుదల చేశారు.

ఈ సినిమాకు అనురాగ బసు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. టీ సిరీస్‌, అనురాగ్ బసు ప్రొడక్షన్‌ బ్యానర్లపై భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులను అలదించిన శ్రీ లీలా ఇక మీదట హిందీ ప్రేక్షకులను అలరించడానికి కూడా సిద్ధమవుతోంది. మరి బాలీవుడ్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో, బాలీవుడ్ ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి మరి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.