Samantha : పాపం..సమంతా కొత్త లుక్ పై ట్రోల్స్..భిన్నాభిప్రాయాలూ..!

Samantha : ఒక సినిమా ఎలా అయితే కేవలం హీరో మీదనే ఆధాపడి ఉంటాయో అదే విధంగా హీరోయిన్ పై కూడా ఆధారపడి ఉండే సినిమాలు కొన్ని ఉంటాయి. వాటినే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు అని అంటాం.. అయితే ఇలాంటి సినిమాలకు ప్రథమ స్థానంలో నిలిచే స్టార్ హీరోయిన్స్ పేర్లు కాస్త తక్కువే ఉంటాయి.

మరి ఈ లిస్ట్ లో ఖచ్చితంగా ఉండే పేరు సమంతా.. తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఓ రేంజ్ లో దూసుకెళ్తున్న సమంతా ఇప్పుడు పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తుంది. వాటిలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న అద్భుతమైన చిత్రం “శాకుంతలం” కూడా ఒకటి.

మన టాలీవుడ్ మోస్ట్ అండర్ రేటెడ్ దర్శకుల్లో ఒకరైన గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు సినిమా దగ్గర భారీ సెట్టింగ్స్ అంటే మొదట గుర్తు వచ్చే పేరుగా తాను ఉండేవాడు. ఇప్పుడు కాస్త టైం బాగాలేదు. కానీ ఫైనల్ గా సమంతా తో ఈ భారీ సినిమా ప్లాన్ చేశారు. అయితే దీని నుంచి నిన్న వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మాత్రం అనుకున్న స్థాయి రెస్పాన్స్ రాలేదు.

సమంతా లుక్ కానీ ఆ పోస్టర్ డిజైన్ గాని అప్ టు మార్క్ లేవు. దీనితో సోషల్ మీడియాలో అనేక ట్రోల్స్ తో పాటు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ముందు అయినా మేకర్స్ మరింత జాగ్రత్తగా ఉంటారేమో చూడాలి. అయితే తన కెరీర్ లో ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ అయినటువంటి దీనికి ఇలాంటి స్పందన వస్తుందని సమంతా అనుకోని ఉండకపోవచ్చు పాపం.