వెబ్ సిరీస్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ -2’. రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్ దర్శకులు. ఈసారి వెబ్ సిరీస్ తమిళనాడు నేపథ్యంలో ఉండనుంది. ఇందులో సమంత ఒక ప్రధాన పాత్ర చేయడం జరిగింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ అందరినీ ఆకట్టుకోగా తమిళ ప్రేక్షకుల్ని మాత్రం కలవరపెట్టింది. ట్రైలర్ చూసిన తమిళులు అందులో సమంత టెర్రరిస్ట్ పాత్రలో నటించడం వారికి నచ్చలేదు. సమంత చేస్తున్న పాత్రలో ఎల్టీటీఈ ఛాయలు కనిపిస్తున్నాయని, అలాంటి ఛాయాలున్న పాత్రను ఉగ్రవాదిగా చూపడం ఏమాత్రం బాగోలేదని, వెబ్ సిరీస్ బ్యాన్ చేయాలని మండిపడ్డారు.
తమిళ జనం ఆరోపణలను వెబ్ సిరీస్ మేకర్స్ లైట్ తీసుకున్నారు. రిలీజయ్యేది ఓటీటీలో కాబట్టి ఎలాంటి ఇబ్బందీ ఉండదని అనుకున్నారు. కానీ ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వమే వెబ్ సిరీస్ మీద బ్యాన్ విధించాలని అంటోంది. అనడమే కాదు యూనియన్ మినిస్టర్ ప్రకాష్ జావేద్కర్ కు లేఖ కూడ రాసింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ విడుదలను ఆపడమో లేకపొతే బ్యాన్ చేయడమో చేయాలని, అసలు దేశం మొత్తం బ్యాన్ చేయాలని కోరారు. ఇక ఈ వివాదం మీద స్పందించిన రాజ్ అండ్ డీకే మాత్రం ఇందులో టెర్రరిస్ట్ అనే పాత్రే లేదని, తమిళ చరిత్రను దృష్టిలో పెట్టుకునే చేశామని, విడుదలయ్యాక అన్ని విషయాలు తెలుస్తాయని అంటున్నారు. మరి ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి.