నాని మాస్ పాన్ ఇండియా సినిమా రిలీజ్ కి సమయం ఫిక్స్.?

నాచురల్ స్టార్ నాని హీరోగా ఇప్పుడు సాలిడ్ మేకోవర్స్ తో ఒక్కో సినిమాలో కనిపిస్తున్నాడు. అలా రీసెంట్ గానే తన కెరీర్ లో హై బడ్జెట్ చిత్రం “శ్యామ్ సింగ రాయ్” తో మెప్పించగా మళ్ళీ దానికి కంప్లీట్ డిఫరెంట్ మేకోవర్ తో “అంటే సుందరానికి” సినిమాతో సిద్ధంగా ఉన్నాడు.

అయితే ఈ రెండు పక్కన పెడితే నాని అభిమానులు మరో సినిమా కోసం చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఆ సినిమానే “దసరా”. ఓడెల శ్రీకాంత్ దర్శకత్వంలో ప్లాన్ చేసిన ఈ చిత్రానికి గాను నాని నెవర్ బిఫోర్ లుక్ ను సిద్ధం చేసాడు. పైగా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు కూడా ఉన్నాయి.

రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ తో అయితే నాని తన మాస్ చూపించగా ఇప్పుడు ఈ మాస్ పాన్ ఇండియా సినిమా రిలీజ్ పై లేటెస్ట్ బజ్ తెలుస్తుంది. ప్రస్తుత టాక్ ప్రకారం అయితే ఈ సినిమాని మేకర్స్ ఈ ఏడాది దసరా రేస్ లో నిలపాలని చూస్తున్నారట. మరి దీనిపై అయితే అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.